‘బొగ్గు’తో బోనెక్కిన మన్మోహన్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘బొగ్గు’తో బోనెక్కిన మన్మోహన్!

‘బొగ్గు’తో బోనెక్కిన మన్మోహన్!

Written By news on Wednesday, August 22, 2012 | 8/22/2012


భూమి కేంద్రప్రభుత్వ సంపదకాదు, జాతి సంపద. భూమి లో నిక్షిప్తమైన ఖనిజాలు, నీరు, భూమి మీద చెట్టూ, పుట్టా, మట్టి, ఇసుక - సమస్తం జాతీ య సంపదే. ఈ సహజ సంప దను దేశాభివృద్ధికి, దేశ ప్రజల అభివృద్ధికి వినియోగించమని ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుని, వారికి ఆ బాధ్యతను అప్పగించారు. వారు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అని డేగ కన్నులతో సదా పర్యవేక్షిస్తూంటారు. 120 కోట్ల ప్రజలు ఆ పనిని నేరుగా చేయటం సాధ్యం కాదు కాబట్టి, రాజ్యాం గం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వాటిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఒకటి.

ప్రభుత్వ ఆదాయ వ్యయాలను పర్యవేక్షిస్తూ, తప్పొప్పులు ఏమైనా ఉంటే ఎత్తిచూపుతుంది. ఆడిటింగ్ అంటే అదే. అలాంటి సంస్థకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను పాలకులు ప్రశ్నిస్తున్నారంటే, నీ పనేదో నువ్వు చూసుకో, మా పాలనా వ్యవస్థలో తలదూర్చవద్దు అని ఆదేశించడమే. రాజ్యాంగాన్ని, అది ఇచ్చిన అధికారాన్ని కాదనే శక్తి ఎవరికీ లేదు. ఇటీవలి కాలంలో ఈ ధోరణి, సుప్రీంకోర్టు ఒకానొక విషయంలో ఇచ్చిన తీర్పును పునరాలోచించాలని కేంద్రం పిటిషన్ దాఖలు చేయటంతో ప్రారంభమైంది.

ఈ ధోర ణికి ప్రతిస్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ న్యాయవ్యవస్థ విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదని చురక అంటించారు. ఈ చురక ప్రధాని మీద పనిచేసిందనడానికి ఆయన ముంబై హైకోర్టు 150 సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంలో చేసిన ఉపన్యాసమే తార్కాణం. పరి పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాలని, ఇందులో న్యాయవ్యవస్థకు ప్రత్యక్ష పాత్ర ఉందని నొక్కి వక్కాణించారు. ప్రధానిని ఒక ప్రశ్న వేయాలనిపిస్తోంది. పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలను రాజ్యాంగం సృష్టించి వాటి పరిధులను, అధికారాలను విస్పష్టంగా పేర్కొంది.

పరిపాలనా వ్యవస్థలో జరిగే తప్పొ ప్పులను ఎత్తిచూపించడానికి రాజ్యాంగం కాగ్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. దాని విధివిధానాలను కూడా నిర్దేశించింది. ప్రధాని పదవి కూడా రాజ్యాంగ సృష్టే. రాజ్యాంగం ఏ వ్యవస్థలను సృష్టించిందో, ఆ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదోనని చూడటం ఆయన బాధ్యత. కాగ్ ఏం తప్పు చేసిందని తన మంత్రు లను కాగ్ మీదకు ఉసికొల్పారో తెలుసుకోవచ్చా? కాగ్ అధిపతి వినోద్ రాయ్ తన హద్దులను అతిక్రమించాడని ప్రధాని కార్యాలయంలో పనిచేసే మంత్రి అంటున్నారు. కాగ్ అధికారాలేమిటోనని రాజ్యాంగ చట్టాన్ని తిరగేసి చూస్తే కాగ్ గురించి కేవలం 20-25 పంక్తులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ అకౌంట్లు చూడటం అతని విధి అని ఉంది. రాయ్ ఆ పనే చేశాడు. అక్కౌంట్లలో జరిగిన లోటుపాట్లను ఎత్తిచూపాడు.

మైనింగ్ లీజులు పొందిన వారు ఎంత మేరకు లాభం పొందారో, ఎంత ఆదాయం ప్రభుత్వం కోల్పోయిందో చెప్పాడు. ఇది తప్పా? సల హాలు కూడా ఇచ్చాడని ఆ మంత్రి ఆరోపణ. సలహా ఇవ్వ టం తప్పయితే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రము ఖులు అందరూ తప్పు చేస్తున్నారన్నమాట. స్వయాన ప్రధాన మంత్రే రంగరాజన్ అధ్యక్షతన ఒక సలహా సంఘాన్ని నియమించుకున్నారు. అంటే మంత్రి నారా యణస్వామి ప్రకారం ప్రధాని కూడా తప్పు చేసినట్లా? వంక లేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్న సామెత గుర్తుకొస్తోంది. అసలు విషయమేమంటే రాయ్ కేంద్ర సర్కార్కు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. కామన్వెల్త్ గేమ్స్, టెలికాం మంత్రి రాజా, మొబైల్ టెలిఫోన్ లెసై న్సులు, ముంబైలో మరణించిన సైనికుల కుటుంబాల నివాసం కోసం నిర్మించిన పలు అంతస్థుల భవనాల కుంభకోణం లాంటి బడా స్కాములన్నింటినీ బహిర్గతం చేసి, ప్రభుత్వ పరువును బజారుకీడ్చాడని గుర్రు.

57 బొగ్గు గనులకు అనుమతిస్తే ఇప్పటికి ఒకే ఒక గని పని చేస్తుందని నారాయణస్వామి ఉవాచ. పని ప్రారంభించకపోతే ఆ భూమిని తిరిగి తీసేసుకోవచ్చుకదా అంటే మిగతా వారంతా కేటాయించిన భూమిని ఆక్రమిం చుకుని ఎలా దుర్వినియోగం చెయ్యాలా, రియల్ ఎస్టేట్గా మార్చవచ్చా అని ఆలోచిస్తుండి ఉండాలి, లేదా గతంలో న్యాయశాఖ రెండుసార్లు వేలం పాట ద్వారానే అమ్మితే ప్రభుత్వానికి అదనపు నిధులు చేకూరుతాయని బొగ్గు గనుల శాఖను అప్పట్లో పర్యవేక్షిస్తున్న ప్రధానికి లేఖలు పంపినా, వేలంపాట విధానాన్ని పక్కకు నెట్టి, ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన తర్వాత, నేరుగా ప్రధా నినే బోనులో నిలబెట్టేసరికి గతుక్కుమన్న ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.

మరో విషయం. కాగ్ సంస్థ పంపిన చిత్తు ప్రతి ప్రకారం రూ.10.7 లక్షల కోట్లు ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి లాభం చేకూర్చినట్లు చెప్పగా, పార్లమెం టులో అందజేసిన నివేదికలో ఆ మొత్తం రూ.1.85 లక్షల కోట్లేనని ఢిల్లీ పత్రికల వార్త. ఇది నిజమా నారాయణ స్వామిగారూ? ఈ కుంభకోణాలన్నీ వివిధ పార్టీలతో ఏర్పాటయిన మంత్రి మండలి ఆమోదం పొందిందా? వినోద్ రాయ్ వయస్సు 64 సంవత్సరాలు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అనేక కమిటీలకు అధ్యక్షునిగా పనిచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా పనిచేశారు. అంతర్జాతీయ ఆడిట్ సంస్థల్లో అధ్యక్షునిగా, సభ్యునిగా పనిచేశారు.

కాగ్ ఆడిట్ సంస్థగా, అక్కౌంట్స్ సంస్థగా పనిచేస్తుంది. పబ్లిక్ - ప్రైవేట్ ఉమ్మడి సంస్థల వ్యవహారాలను కూడా పర్యవేక్షి స్తుంది. రియలన్స్ ఆయిల్ డి-6 బ్లాక్ అక్కౌంట్స్ను ఆడిట్ చేయాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థల్లో ఆడి టర్లు ఆ సంస్థల యాజమాన్యాల ప్రయోజనాల కోసం పనిచేస్తారు. కాగ్ దేశ ప్రజల ప్రయోజనాల కాపలాదా రుగా వ్యవహరిస్తుంది. ఇన్ని రకాల సంస్థలు, ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో స్వానుభవంతో తెలుసుకున్న అధికారి, అలా సుదీర్ఘ అనుభవాలతో తల నెరసిన అధికారి తానేమి రాస్తున్నాడో, ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో తెలిసి కూడా ప్రభుత్వాన్ని జుట్టు పట్టు కుని బజారుకీడ్చాడంటే దాని పరిణామాలేమిటో ఆయ నకు తెలియకపోలేదు. ప్రస్తుత స్కామ్లో ప్రధానిని కూడా దోషిగా నిలబెట్టారంటే ఆయనకు శిరస్సు వంచిన నమస్కరించాలి.

ఈ బొగ్గు గనుల స్కామ్ గురించి ప్రధానికి హెచ్చరి కలు ఏనాడో వెళ్లాయి. ఉదాహరణకు మహారాష్ట్ర నుంచి పార్లమెంటుకు ఎన్నికైన హన్స్రాజ్ గంగారామ్ ఆహిర్ 2006, డిసెంబర్లోనే ప్రధాని మన్మోహన్కు, అప్పటి ఆర్థికమంత్రి చిదంబరానికి బొగ్గుగనుల గోల్మాల్ గురించి లేఖ రాశానని, ఈ విషయంలో రాసిన 30 లేఖల్లో 12 లేఖలు ప్రధానికే పంపానని, 2009లో సెంట్రల్ విజి లెన్స్ కమిషన్కు, 2010లో కాగ్కు ఉత్తరాలు పంపానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

చివరన రాసిన రెండు లేఖల తర్వాతనే ఎంక్వయిరీ ప్రారంభమైందని అన్నారు. కేటాయింపు లభించిన ప్రైవేట్ కంపెనీలు వాటిని ఇతరు లకు అమ్మేసి కోట్లు గడించాయని వెల్లడించారు. ఇదంతా తెలిసిన తర్వాత ప్రధాని వ్యక్తిగతంగా ఏమీ సొమ్ము చేసుకోలేదు కాని, కాంగ్రెస్ పార్టీకి అన్ని వేళలా దన్నుగా నిలబడే ప్రైవేట్ సంస్థలు సొమ్ము చేసుకోవడానికి తోడ్ప డ్డారనే చెప్పాల్సి ఉంటుంది. అవినీతి అంటే కేవలం డబ్బు చేతులు మారడమే కాదు. నీతిరహితంగా ప్రవర్తించడం కూడా అవినీతే! కాదంటారా?పార్లమెంటులో బొగ్గు కుంభకోణం మంట రాజేస్తు న్నది. బీజేపీ పాలించిన కాలంలో కూడా ఛత్తీస్గఢ్, కర్ణా టక రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులను పందేరం చేశారు. కేంద్రం మీద విరుచుకుపడే మమతా బెనర్జీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ప్రఫుల్ పటేల్ ఉలుకూ పలుకూ లేదు.

సంస్కరణలు 1991లో ప్రవేశపెట్టకముందు కూడా స్కాముల పాములు ప్రభుత్వాన్ని చుట్టుముట్టకపోలేదు. కాని ఇంతంత పెద్ద స్కాములు ఆ తర్వాతనే చోటు చేసు కుంటున్నాయంటే, అది కేవలం సంస్కరణల పుణ్యమే. ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తేనే మీకు అప్పు ఇస్తామనే షరతును పీవీ నరసింహారావు - మన్మోహన్ ద్వయం అంగీకరించిన తర్వాతనే అప్పట్లో దేశం సంక్షోభం నుంచి బయటపడింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నది. ఆ ప్రైవేటీకరణలో భాగమే బొగ్గు గనులను ప్రైవేట్ రంగానికి దారాదత్తం చేయటం! 
Share this article :

0 comments: