వీరా మన మంత్రులు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వీరా మన మంత్రులు!

వీరా మన మంత్రులు!

Written By news on Thursday, August 23, 2012 | 8/23/2012

శాసనసభ్యులుగా ఎన్నికై, రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్న మంత్రులు చిన్నపిల్లల్లా మాట్లాడటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం.

మన రాష్ట్ర మంత్రుల మాటలు వింటుంటే నవ్వొస్తుంది. కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేసిన విషయంలో వారు చెబుతున్న కథనాలు చిన్నపిల్లలకు కూడా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. వీరు ఏమైనా చిన్న పిల్లలా? లేక జనాన్ని చిన్న పిల్లలు అనుకుంటున్నారా? జనం ఏమైనా అనుకుంటారని సిగ్గుకూడా వారికి ఉన్నట్లులేదు. శాసనసభ్యులుగా ఎన్నికై, రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్న మంత్రులు ఇలా మాట్లాడటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఇటువంటివారిని ఎన్నుకున్నందుకు జనం సిగ్గుపడాలా? ఇలా మాట్లాడుతున్నందుకు ఆ మంత్రులు సిగ్గుపడాలా? 

లేని క్విడ్ ప్రోకోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై రుద్దారు. రాజకీయంగా ఆయనని అణచివేసేందుకు ప్రధాన ప్రతిపక్షంతో కలిసి అధికార కాంగ్రెస్ నేతలు కుట్రపన్నారు. ఆ కుట్ర క్రమక్రమంగా బట్టబయలవుతోంది. తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లు వారికి ఇప్పటికిగానీ అర్ధంకాలేదు. ఆనాడు జగన్ పై క్విడ్ ప్రోకో ఆరోపణలు చేసినప్పుడు నోరుమూసుకొని కూర్చున్న మంత్రులకు ఇప్పుడు తమదాకా వస్తేగానీ తెలిసిరాలేదు. 

తాము ఒత్తిళ్లకు లోనై సంతకాలు చేశామని కొందరు మంత్రులు వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులేమన్నా రబ్బరు స్టాంపులా లేక నిరక్షరాస్యులా అని జనం ప్రశ్నిస్తున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాతో ఠారెత్తిన మంత్రులు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీని స్థితిలో ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు మంత్రులు వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడవుతున్న అభిప్రాయాలు విచిత్రంగా ఉన్నాయి. ఎవరో చెబితే తాము ఎక్కడెక్కడో ఉండి కూడా సంతకాలు చేశామని బాధ్యతారహితంగా వాదిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి పట్టుమని మూడు మంత్రిమండలి సమావేశాలు కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉంది. ఆనాడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో నెలకు కనీసం రెండు సార్లు మంత్రి మండలి సమావేశాలు జరిగేవి. ఆ సమావేశాల్లో సదరు మంత్రులు తమ అనుమానాలను ఎందుకు నివృత్తి చేసుకోలేదు?

26 జీఓల న్యాయబద్ధతను హైకోర్టు ప్రశ్నించినపుడే కౌంటర్ వేయాల్సిన కనీస బాధ్యతని ఈ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జగన్ ని ఇరుకున పెట్టాలని వారు పన్నిన కుట్ర ఇపుడు రుజువవుతోంది. ఆనాడు జగన్, మంత్రి మోపిదేవి వెంకట రమణ అరెస్ట్ అవడానికి, నేడు మరి కొందరు మంత్రులు అరెస్ట్ అయ్యే పరిస్థితి తలెత్తడానికి ప్రభుత్వ మౌనమే ప్రధాన కారణమని స్పష్టమైంది. అప్పుడు మౌనంగా ఉన్న మంత్రులు ఇపుడు తమదాకా వచ్చేసరికి బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని కోరి అప్పటి ప్రభుత్వం మంత్రి మండలి ద్వారా తీసుకున్న ఉమ్మడి విధాన నిర్ణయాల ఆధారంగానే ఆ 26 జీవోలు జారీ చేశారు. అవి ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోనాలకు ఉద్దేశించినవి కావు. ఆ విషయం మంత్రులకూ తెలుసు. ఆ జీఓలు సక్రమమైనవేనని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ నాడు మంత్రి మండలి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆ జీఓలను జారీ చేసినట్లు ప్రభుత్వం తరపున హైకోర్టుకు తెలిపి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేదికాదు. వాస్తవాలను విస్మరించి జగన్ ను క్విడ్ ప్రోకో కింద ఇబ్బందులకు గురి చేసిన వారిమెడకే చుట్టుకోవడంతో ఇప్పుడు వారు మింగలేక కక్కలేక సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. 

సుప్రీం కోర్టు నోటీసులు: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జీఓలకు సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన పి.సుధాకర రెడ్డి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఆరుగురు మంత్రులకు, 8 మంది ఐఎఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. మంత్రులు పి.సబిత ఇంద్రా రెడ్డి, జె.గీతారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకట రమణలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆ జీఓలు జారీ చేసిన ఐఎఎస్ అధికారులు ఎస్.వి.ప్రసాద్(ప్రస్తుతం పదవీ విరమణ చేశారు), సివిఎస్ కె శర్మ, ఎం.శామ్యూల్, వై.శ్రీలక్ష్మి, ఆదినారాయణ దాస్, కె.రత్నప్రభ, బి.శ్యామ్ బాబు, మన్మోహన్ సింగ్ లకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 26 వివాదాస్పద జీఓలు జారీ అవడానికి ప్రధాన కారకులు ఈ 14 మంది అని సుధాకర రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

YSR was an able personality to make all this ministers as ministers of work. He could have achieved a lot of progress with these people only, if he was alive. Now the supremo of the present INC made them stupids fit for nothing for her personal political benefits. Poor ministers became fools, now.