మహారాష్ట్ర-కర్ణాటకలోని ఉన్న ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలోనే.వానదేవుడు వైఎస్‌ఆర్ అయితే..కరువు దేవుడు చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహారాష్ట్ర-కర్ణాటకలోని ఉన్న ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలోనే.వానదేవుడు వైఎస్‌ఆర్ అయితే..కరువు దేవుడు చంద్రబాబు

మహారాష్ట్ర-కర్ణాటకలోని ఉన్న ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలోనే.వానదేవుడు వైఎస్‌ఆర్ అయితే..కరువు దేవుడు చంద్రబాబు

Written By news on Wednesday, August 1, 2012 | 8/01/2012

కృష్ణా డెల్టా ఎండిపోవడానికి చంద్రబాబు విధానాలే కారణమని వైఎస్‌ఆర్ సీపీ నేత రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... తొమ్మిదేళ్ల పరిపాలనలో కృష్ణా డెల్టాను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు రైతన్నపై దొంగప్రేమ చూపుతున్నారు అని అన్నారు. మహారాష్ట్ర-కర్ణాటకలోని ఉన్న ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయని.. వాటిని అడ్డుకుని ఉండుంటే కృష్ణాడెల్టా ఎండిపోయేది కాదని అన్నారు. 

వైఎస్‌ఆర్ ఒక రూపాయి కూడా పన్నువేయకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుకు రైతుల సంక్షేమం కోసం జలయజ్ఞం చేపట్టారని ఆయన తెలిపారు. ప్రాజెక్టులు చేపడితే అణా పైసా లాభం ఉండదన్న బాబు.. ఇప్పుడు ప్రాజెక్టు యాత్ర చేయడమన్నది హాస్యాస్పదమని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రైతులకు పంట వద్దని చెప్పిన బాబు...ఇప్పుడు రైతులపై కపట ప్రేమచూపుతున్నారన్నారు. 

కింగ్‌మేకర్‌ అని చెప్పుకునే చంద్రబాబు... నీటి ప్రాజెక్టులను అప్పటి దేవెగౌడ కర్ణాటకకు తరలించినా.. కళ్లు మూసుకుని ఉన్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా మార్చిన చంద్రబాబుకు వందేళ్ల జైలుశిక్షవేయాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్ల బాబు పాలనలో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు పూర్తికాలేదని... వైఎస్‌ సీఎం కాగానే 1500 కోట్ల రూపాయలు వెచ్చించి 30 టీఎంసీల నీరు తెచ్చారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 

వానదేవుడు వైఎస్‌ఆర్ అయితే..కరువు దేవుడు చంద్రబాబు అని జనం అంటున్నారని మీడియాతో అన్నారు. ఆయన చేస్తున్నది ప్రాజెక్టుల బాట కాదు.. ఆయన ప్రాజెక్టులు ఆపేందుకే బాట కార్యక్రమం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వైఎస్‌ఆర్‌ ఫొటోపై కాంగ్రెస్‌ నాయకులు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 

మహానేత వైఎస్ ప్రతిష్టను తగ్గించేందుకే కాంగ్రెస్ నాయకులు , మంత్రులు ఆయన గురించి మాట్లాడుతున్నారని.. వైఎస్ ఫొటో పెట్టడం కన్నా.. చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. వైఎస్‌పై అభిమానం ఉంటే హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ మెమోరియల్ ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు. క్రెడిబులిటీ ఉన్న వ్యక్తులకు, ప్రజలకు సేవచేసే వ్యక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ స్థానం ఉంటుందన్నారు. 

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చేస్తున్న ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌ చంద్రబాబు డ్రామా అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్‌ గురించి మాట్లాడేందుకు, ఆయన ఫొటో వాడుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ఖచ్చితంగా అనర్హులన్నారు. ఎందుకంటే ఆయన కుటుంబంపై నిందలు వేసి ఆయన కుమారుడిని అరెస్ట్ చేయించారని.. వైఎస్‌పై ప్రేమ చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ నాయకులు ఇలా చేస్తారా అని ప్రశ్నించారు.
Share this article :

0 comments: