అతివినయం ధూర్తలక్షణమని అప్పుడే చెప్పిన.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అతివినయం ధూర్తలక్షణమని అప్పుడే చెప్పిన..

అతివినయం ధూర్తలక్షణమని అప్పుడే చెప్పిన..

Written By news on Saturday, August 25, 2012 | 8/25/2012


‘‘కిరణ్‌కుమార్‌రెడ్డిలో ఏం చూసి సీఎంను చేశారో! రాష్ట్రంలో ప్రజల అభీష్టం, పరిస్థితులు అధిష్టానానికి అక్కర్లేదా? అధిష్టానానికి ఎందుకు, ఎవరిమీద దయ కలుగుతుందో తెలియదు. ఓ మదరాసీ చెప్పిండట.. కిరణ్‌ను సీఎం చేసేశారు. రాష్ట్రంలో కరెంటు లేదు. మంచినీళ్లు లేవు. పేదవాడు కడుపునిండా తినేస్థాయిలో ధరల్లేవు. ఇవేవీ పట్టించుకోకుండా సీఎం, మంత్రులంతా కుర్చీలు ఎప్పుడు పోతాయోననే భయంతో వాటినే పట్టుకుని వేలాడుతున్నరు. సీఎంపై పీసీసీ చీఫ్, పీసీసీ చీఫ్‌పై సీఎం చాడీలు చెప్పుకోవడానికి ఢిల్లీ పర్యటనలుంటున్నయి. రాష్ట్రంలో ప్రభుత్వముందా?’’ అని కాంగ్రెస్ సీనియర్‌నేత, తెలంగాణ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు. శుక్రవారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. అక్కడ సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, ఇక్కడ కిరణ్, అవినీతి మంత్రులంతా కలిసి కాంగ్రెస్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారని ఆయన విమర్శించారు. వీళ్ల నిర్వాకంతో కాంగ్రెస్ క్లిష్టపరిస్థితుల్లో పడిపోయిందన్నారు. కాంగ్రెస్‌పార్టీకి తలాతోకా, పద్ధతి, విధానం, సిద్ధాంతం ఏమీలేకుండా పోయిందన్నారు. ‘‘రాష్ట్రంలో కరువు ఇంతకుముందు రాలేదా? వర్షాభావ పరిస్థితులిప్పుడే కొత్తగా వచ్చాయా? పాలకులకు సంకల్పం లేనందునే ప్రజలిబ్బందులు పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. 

అతివినయం ధూర్తలక్షణమని అప్పుడే చెప్పిన..

వైఎస్ బతికి ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి విప్‌గా అసెంబ్లీలో ఎంతో వినయం ప్రదర్శించేవాడని ఉప్పునూతల అన్నారు. ‘‘కిరణ్‌ను స్పీకర్‌గా చేస్తానని వైఎస్ అంటే వద్దని చెప్పిన. అతివినయం ధూర్తలక్షణం అని చెప్పిన. ముందున్నప్పుడు వంగివంగి సలాములు చేసి వినయంగా ఉండేవారు చాటుగా చెడు చేస్తారని చెప్పిన. అయినా వైఎస్ వినకుండా కిరణ్‌ను గుడ్డిగా నమ్మిండు. ఇప్పుడేమో అదే వైఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నడు. చివరకు వైఎస్ ఫోటోలు వద్దనే స్థాయికీ సీఎం పోయిండు. ఫోటోలు తీసేయిస్తే ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్‌ను తీసేయించగలడా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కేబినెట్‌దే సమష్టి బాధ్యత. మంత్రులేమన్నా చిన్నపిల్లలా భయపడటానికి? మంత్రులే అడ్డగోలుగా అవినీతికి పాల్పడి.. ఇప్పుడు ప్రాణాలతో లేని వైఎస్‌పై నిందవేయాలని చూస్తున్నరు’’. అని ఉప్పునూతల ధ్వజమెత్తారు. 
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

KKR sat at the feet of Sonia Gandhi, before he got the job. Sonia Gandhi is going on teaching the cadre to talk against YSJMR and YSR in all the possible directions. This, the people are calling "THE BRUTALITY".