ఎక్కువే గెలుస్తాం: వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఎక్కువే గెలుస్తాం: వైఎస్సార్‌సీపీ

ఎక్కువే గెలుస్తాం: వైఎస్సార్‌సీపీ

Written By news on Wednesday, August 29, 2012 | 8/29/2012

ఎన్డీటీవీ వెల్లడించిన సర్వేను తాము విశ్వసించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పేర్కొంది. ఆ సర్వేలో పేర్కొన్నట్టు తమకు రాష్ట్రంలో 21 లోక్‌సభ స్థానాలు కాదని, కనీసంగా 35 స్థానాలకుపైనే గెలుస్తామన్న నమ్మకం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారంనాడిక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు తమ పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఎన్డీటీవీ సర్వే వెల్లడించడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. ఒక్క ఎన్డీటీవీయే కాదని, గతంలో సీఎన్‌ఎన్ ఐబీఎన్, బాబు బాగా ఇష్టపడే ఇండియా టుడే సంస్థలు నిర్వహించిన సర్వేలో కూడా జగన్ ప్రభంజనం నడుస్తున్నట్లు వెల్లడైందని, వాటిపై ఏమంటారని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. 2009 ఎన్నికలకు ముందు కూడా ఎన్డీటీవీ చేసిన సర్వేలో టీడీపీకి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడైతే బాబు అపుడు కూడా విమర్శించారని, ఎన్నికల అనంతరం ఆయన పార్టీకి వచ్చింది ఐదు సీట్లేనని వారన్నారు.
Share this article :

0 comments: