విద్యుత్ కార్మికులకు అండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ కార్మికులకు అండ

విద్యుత్ కార్మికులకు అండ

Written By news on Friday, August 3, 2012 | 8/03/2012


విజయవాడ, న్యూస్‌లైన్ : విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు కార్మికులకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఎప్పుడూ అండగా ఉంటుందని కౌన్సిల్ రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్ పేర్కొన్నారు. జనక్‌ప్రసాద్ సమక్షంలో విజయవాడలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ (జీ 3045) వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌కు అనుబంధంగా కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఈ సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా 16వేల మంది సభ్యత్వం ఉంది. ఈ సందర్భంగా జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి ఇతర సమస్యల పరిష్కారానికి సంఘం నాయకులను ట్రాన్స్‌కో ఎండీ వద్దకు తీసుకెళ్లామని, బుధవారం సీఎంను కలిశామని చెప్పారు. ప్రిన్సిపల్ కార్యదర్శి, లేబర్ కమిషనర్లతో సమష్టి సమావేశం ఏర్పాటుచేసేందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్లలో 8 వేల మంది కాంట్రాక్టు కార్మికులు, ఆర్టీసీ, సింగరేణి, స్టీల్‌ప్లాంట్ కార్మికులను పర్మినెంట్ చేసేంతవరకు పోరాడతామన్నారు. కేవీపీ భావోద్వేగంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ఆయనను జగన్‌కు కోవర్టు అనడం సరికాదన్నారు. 

వైఎస్ మరణించినపుడు పరామర్శించడానికి వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వైఎస్ మహానేతని, అత్యంత సమర్థుడైన నాయకుడని, రాష్ట్ర సంక్షేమానికి కృషిచేసిన వ్యక్తిగా అభివర్ణిస్తూ సంతకాలు చేశారని గుర్తు చేశారు. జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ (జీ 3045) ప్రధాన కార్యదర్శి పి.కాశీ మధుబాబు, అధ్యక్షుడు కేఎన్వీ సీతారామ్ మాట్లాడుతూ జగన్ తమకు అండగా నిలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బీపీకే చంద్రం, బి.రమేష్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, మెదక్ జిల్లా కన్వీనర్ నర్రా భిక్షపతి, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ అవిర్నేని శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కన్వీనర్ వేజెండ్ల శివశంకర్, విజయవాడ సిటీ కన్వీనర్ విశ్వనాథ రవి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: