పులివెందులలో పోలీసుల జులుం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పులివెందులలో పోలీసుల జులుం

పులివెందులలో పోలీసుల జులుం

Written By news on Friday, August 31, 2012 | 8/31/2012

కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం కన్వీనర్‌ అవినాష్ రెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈడ్చుకెళ్ళి, పోలీసు వాహనాల్లో పడేశారు. పులివెందులలో అదనపు బలగాలు మోహరించి, భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి ఈసందర్భంగా డీఎస్పీని ప్రశ్నించారు.
Share this article :

0 comments: