ఫీజులెత్తేస్తే మహోద్యమమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫీజులెత్తేస్తే మహోద్యమమే

ఫీజులెత్తేస్తే మహోద్యమమే

Written By news on Wednesday, August 8, 2012 | 8/08/2012



 రాష్ట్రంలోని కేజీ బేసిన్ నుంచి వెలువడుతున్న గ్యాస్‌ను ఇక్కడి అవసరాలు తీరకుండా మహారాష్ట్రకు తరలిస్తుంటే రాష్ర్ట్రం తరఫున కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రులు ఏం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నించింది. వారి నిర్లక్ష్యానికి ప్రతిగా తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్న ఎస్.జైపాల్‌రెడ్డి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కళ్లు మూసుకున్నారా? అని ఆ పార్టీ నిలదీసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం విలేకరులతో(రత్నగిరి ప్లాంట్‌కు గ్యాస్ తరలింపును తాత్కాలికంగా నిలిపివేయకముందు) మాట్లాడారు. గ్యాస్ కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయాన్ని అడ్డుకోలేకపోయిన మంత్రి జైపాల్‌రెడ్డిలతోపాటు రాష్ట్రానికి చెందిన ఇతర కేంద్రమంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ గ్యాస్ రాష్ట్ర అవసరాలను తీర్చకపోతే కొండపల్లి దాటి ముందుకుపోదని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రిలయన్స్ సంస్థను గట్టిగా హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాదు పలుమార్లు ప్రధానికి లేఖలు రాసినట్లు తెలిపారు. ఒకరకంగా వైఎస్‌ఆర్ సొంత పార్టీ ప్రభుత్వం మీదే పోరాటం చేశారని ఆయన చెప్పారు. 

ఫీజులెత్తేస్తే మహోద్యమమే 

పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహోద్యమాన్ని చేపడుతుందని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఇప్పటికే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆగస్టు 12, 13 తేదీల్లో ఏలూరులో దీక్ష చేపట్టనున్న విషయాన్ని గుర్తుచేశారు. 
Share this article :

0 comments: