ఎరువుల బలం కంపెనీలకే.. రవాణా భారం రైతులపైనే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎరువుల బలం కంపెనీలకే.. రవాణా భారం రైతులపైనే..

ఎరువుల బలం కంపెనీలకే.. రవాణా భారం రైతులపైనే..

Written By news on Thursday, August 9, 2012 | 8/09/2012

- ఎమ్మార్పీ రేటు రూ.281... డీలర్ల ధర రూ.350
- రైతులపై ఏటా 200 కోట్ల భారం
- డీలర్లకు రవాణా చార్జీలు ఇవ్వని ఎరువుల కంపెనీలు
- దాంతో ఆ భారాన్ని అన్నదాతలపై వేస్తున్న డీలర్లు
- పట్టించుకోని వ్యవసాయ శాఖ 

హైదరాబాద్, న్యూస్‌లైన్ : మద్యం బాటిళ్లను కచ్చితంగా ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలని చెబుతున్న ప్రభుత్వం.. రైతుకు అవసరమయ్యే ఎరువులకు మాత్రం ఈ నిబంధన వర్తింపజేయడం లేదు! ఒక్కో యూరియా బస్తాపై డీలర్లు ఎమ్మార్పీ ధర కన్నా రూ.70 అధికంగా దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రూ.281 ఉన్న యూరియా బస్తాను డీలర్లు, వ్యాపారులు రైతులకు రూ.350కు విక్రయిస్తున్నారు. ఇలా ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో రాష్ట్ర రైతులపై ఏటా రూ.200 కోట్ల భారం పడుతోంది!! 

ఖరీఫ్ సీజనులో వర్షాలు ఆలస్యంగా రావడంతో పంటల సాగు కూడా ఆలస్యమైంది. ఓ మోస్తరు వర్షాలకుతోడు ఎరువులు వేస్తే ఫలితం ఉంటుందన్న ఆశతో రైతులు ప్రస్తుతం ఎరువులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కల పెంపులో కీలక పాత్ర పోషించే కాంప్లెక్సు ఎరువుల బస్తా సగటున రూ.1200 ఉండడంతో యూరియాను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. బస్తా యూరియాకు రూ.281 ఎమ్మార్పీ ఉంటే డీలర్లు, వ్యాపారులు మాత్రం రైతుల నుంచి ఒక్కో బస్తాకు రూ.350 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన వ్యవసాయ శాఖ.. ఎరువుల కంపెనీలకే వత్తాసు పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రవాణా చార్జీలను కంపెనీలు తమకు ఇవ్వకపోవడం వల్లే అధిక ధరలకు అమ్మాల్సివస్తోందని డీలర్లు ఎన్నిసార్లు చెప్పినా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు.
కంపెనీల ధోకా...
ఎమ్మార్పీ రూ.281.60 ఉండే 50 కిలోల యూరియా బస్తాను నాగార్జున ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) కంపెనీ డీలర్లకు రూ.272.10కు సరఫరా చేస్తోంది. వ్యాట్ మినహాయిస్తే ఎన్‌ఎఫ్‌సీఎల్ యూరియా బస్తాపై డీలర్లకు రూ.9.50 మిగులుతోంది. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉండేందుకు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది. 

ఒక్కో యూరియా బస్తాపై 25 కిలో మీటర్లు అయితే రూ.13.70, 50 కిలో మీటర్లకు రూ.16.25, 70 కిలో మీటర్లకు రూ.19.30, వంద కిలో మీటర్లకు రూ.25 చొప్పున కేంద్ర ప్రభుత్వమే కంపెనీలకు రవాణా చార్జీలు చెల్లిస్తుంది. ఓడ రేవుల నుంచి దేశంలో ఎలాంటి మారుమూల ప్రాంతానికైనా స్థానిక పరిస్థితులను బట్టి ఎమ్మార్పీ ధరల్లో తేడా లేకుండా ఉండేలా ఈ రవాణా చార్జీలను కేంద్రం ఖరారు చేస్తుంది. ఇలా కేంద్రం ఇచ్చే రవాణా చార్జీలను అన్ని ఎరువుల కంపెనీలు బొక్కేస్తున్నాయి. జిలా కేంద్రాల నుంచి లారీల్లో ఎరువులను పంపి డీలర్లతోనే వాటా కిరాయిలు కట్టిస్తున్నాయి. 

ఇదేమిటని ప్రశ్నించిన డీలర్లకు ఎరువులు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇలా రవాణా చార్జీలతోపాటు హమాలీ, కంపెనీలకు చెల్లించే మొత్తానికి తీసే బ్యాంకు డీడీ కమీషను, విలువ ఆధారిత పన్ను కలిపి ఒక్కో యూరియా బస్తాకు జిల్లా కేంద్రంలోనే కనీసం రూ.301 అవుతోందని డీలర్లు చెబుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ రవాణా చార్జీల భారం పెరుగుతోందని, విధిలేని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని తాము రైతుల నుంచి వసూలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లో ఎరువుల అమ్మకంపై పన్ను మినహాయించారు. దీంతో రైతులపై భారం తగ్గింది. మన ప్రభుత్వం మాత్రం రైతులకు ఎమ్మార్పీకి ఎరువులను అందించే ప్రయత్నం కూడా చేయడంలేదు.

అవసరం లేని ఎరువులను అంటగడుతున్న ‘మన గ్రోమోర్’
ఖరీఫ్, రబీల్లో కలిపి రాష్ట్రంలో ఏటా దాదాపు 70 లక్షల టన్నుల ఎరువులు వినియోగమవుతాయి. కాంప్లెక్సు ఎరువుల్లో 60 శాతం, డీఏపీ ఎరువుల్లో 25 శాతం వరకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీయే సరఫరా చేస్తుంటుంది. రైతులకు నేరుగా ఎరువులను అందించేందుకు వీలుగా ఈ కంపెనీ ‘మన గ్రోమోర్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 420 ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది. 

వ్యవసాయ శాఖ ఈ కేంద్రాలను రిటైల్ డీలర్లతో సమానంగా పరిగణిస్తూ డీఏపీ, యూరియా, కాంపెక్లు ఎరువులను కేటాయిస్తోంది. రైతులు తమకు అవసరమైన డీఏపీ, యూరియా కోసం తప్పనిసరిగా మన గ్రోమోర్ కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. 

కోరమండల్ కంపెనీ రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని వారికి అవసరం లేకున్నా రూ.300 నుంచి రూ.500 విలువ చేసే వర్మీకంపోస్టు, సల్ఫర్, సూపర్, బయో, ఆర్గానిక్, ఇతర సూక్ష్మపోషక ఎరువులను అంటగడుతోంది. రోజుల తరబబడి దుకాణాల ముందు నిల్చుంటేనే ఒక బస్తా ఎరువు ఇవ్వని మన గ్రోమోర్ కేంద్రాలు ఈ ఉప ఉత్పత్తులను మాత్రం లారీల ద్వారా నేరుగా రైతుల ఇళ్ల వద్దకు చేర్చుతోంది. వీటిని నివారించాల్సిన వ్యవసాయ శాఖ మాత్రం చోద్యం చూస్తోంది.

సీజనులో వర్షాలు ఆలస్యంగా రావడంతో పంటల సాగు కూడా ఆలస్యమైంది. ఓ మోస్తరు వర్షాలకుతోడు ఎరువులు వేస్తే ఫలితం ఉంటుందన్న ఆశతో రైతులు ప్రస్తుతం ఎరువులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కల పెంపులో కీలక పాత్ర పోషించే కాంప్లెక్సు ఎరువుల బస్తా సగటున రూ.1,200 ఉండడంతో యూరియాను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. 

బస్తా యూరియాకు రూ.281 ఎమ్మార్పీ ఉంటే డీలర్లు, వ్యాపారులు మాత్రం రైతుల నుంచి ఒక్కో బస్తాకు రూ.350 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన వ్యవసాయ శాఖ.. ఎరువుల కంపెనీలకే వత్తాసు పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రవాణా చార్జీలను కంపెనీలు తమకు ఇవ్వకపోవడం వల్లే అధిక ధరలకు అమ్మాల్సివస్తోందని డీలర్లు ఎన్నిసార్లు చెప్పినా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు.

కంపెనీల ధోకా...
ఎమ్మార్పీ రూ.281.60 ఉండే 50 కిలోల యూరియా బస్తాను నాగార్జున ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) కంపెనీ డీలర్లకు రూ.272.10కు సరఫరా చేస్తోంది. వ్యాట్ మినహాయిస్తే ఎన్‌ఎఫ్‌సీఎల్ యూరియా బస్తాపై డీలర్లకు రూ.9.50 మిగులుతోంది. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉండేందుకు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది. 

ఒక్కో యూరియా బస్తాపై 25 కిలో మీటర్లు అయితే రూ.13.70, 50 కిలో మీటర్లకు రూ.16.25, 70 కిలో మీటర్లకు రూ.19.30, వంద కిలో మీటర్లకు రూ.25 చొప్పున కేంద్ర ప్రభుత్వమే కంపెనీలకు రవాణా చార్జీలు చెల్లిస్తుంది. ఓడ రేవుల నుంచి దేశంలో ఎలాంటి మారుమూల ప్రాంతానికైనా స్థానిక పరిస్థితులను బట్టి ఎమ్మార్పీ ధరల్లో తేడా లేకుండా ఉండేలా ఈ రవాణా చార్జీలను కేంద్రం ఖరారు చేస్తుంది. ఇలా కేంద్రం ఇచ్చే రవాణా చార్జీలను అన్ని ఎరువుల కంపెనీలు బొక్కేస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి లారీల్లో ఎరువులను పంపి డీలర్లతోనే వాటా కిరాయిలు కట్టిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన డీలర్లకు ఎరువులు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇలా రవాణా చార్జీలతోపాటు హమాలీ, కంపెనీలకు చెల్లించే మొత్తానికి తీసే బ్యాంకు డీడీ కమీషను, విలువ ఆధారిత పన్ను కలిపి ఒక్కో యూరియా బస్తాకు జిల్లా కేంద్రంలోనే కనీసం రూ.301 అవుతోందని డీలర్లు చెబుతున్నారు.

జిల్లా కేంద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ రవాణా చార్జీల భారం పెరుగుతోందని, విధిలేని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని తాము రైతుల నుంచి వసూలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లో ఎరువుల అమ్మకంపై పన్ను మినహాయించారు. దీంతో రైతులపై భారం తగ్గింది. మన ప్రభుత్వం మాత్రం రైతులకు ఎమ్మార్పీకి ఎరువులను అందించే ప్రయత్నం కూడా చేయడంలేదు.

అవసరం లేని ఎరువులను అంటగడుతున్న ‘మన గ్రోమోర్’
ఖరీఫ్, రబీల్లో కలిపి రాష్ట్రంలో ఏటా దాదాపు 70 లక్షల టన్నుల ఎరువులు వినియోగమవుతాయి. కాంప్లెక్సు ఎరువుల్లో 60 శాతం, డీఏపీ ఎరువుల్లో 25 శాతం వరకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీయే సరఫరా చేస్తుంటుంది. రైతులకు నేరుగా ఎరువులను అందించేందుకు వీలుగా ఈ కంపెనీ ‘మన గ్రోమోర్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 420 ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ ఈ కేంద్రాలను రిటైల్ డీలర్లతో సమానంగా పరిగణిస్తూ డీఏపీ, యూరియా, కాంపెక్లు ఎరువులను కేటాయిస్తోంది.

రైతులు తమకు అవసరమైన డీఏపీ, యూరియా కోసం తప్పనిసరిగా మన గ్రోమోర్ కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. కోరమండల్ కంపెనీ రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని వారికి అవసరం లేకున్నా రూ.300 నుంచి రూ.500 విలువ చేసే వర్మీకంపోస్టు, సల్ఫర్, సూపర్, బయో, ఆర్గానిక్, ఇతర సూక్ష్మపోషక ఎరువులను అంటగడుతోంది. రోజుల తరబబడి దుకాణాల ముందు నిల్చుంటేనే ఒక బస్తా ఎరువు ఇవ్వని మన గ్రోమోర్ కేంద్రాలు ఈ ఉప ఉత్పత్తులను మాత్రం లారీల ద్వారా నేరుగా రైతుల ఇళ్ల వద్దకు చేర్చుతోంది. వీటిని నివారించాల్సిన వ్యవసాయ శాఖ మాత్రం చోద్యం చూస్తోంది.
Share this article :

0 comments: