వైఎస్ మరణంతో సంక్షేమం కనుమరుగు: బాజిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మరణంతో సంక్షేమం కనుమరుగు: బాజిరెడ్డి

వైఎస్ మరణంతో సంక్షేమం కనుమరుగు: బాజిరెడ్డి

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012


మహానేత వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనుమరుగయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్‌తో వికలాంగులు గురువారమిక్కడ వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 

ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంలా మారిపోయిందని విమర్శించారు. వికలాంగుల సంక్షేమానికి రూ.200 కోట్లు బడ్జెట్ అవసరముందన్నారు. అయితే నామమాత్రంగా రూ.63 కోట్లు కేటాయించినా అందులో రూ.36 కోట్లే ఖర్చు చేయడం బాధాకరమన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి కూడా వికలాంగులకు రూ.75కు మించి పెన్షన్ పెంచలేకపోయిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రూ.2 వేలు చేస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ బాటలోనే నడుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ వికలాంగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం వైకల్యాన్ని శాపంగా చూస్తోందని విమర్శించారు. వారికి ఇతరులతోపాటు సమానంగా అవకాశాలు కల్పించాలని కోరారు. వికలాంగులకు రూ.రెండు వేలు పెన్షన్ న్యాయమైనదేనని న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ అన్నారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు జి.దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ సుధాకర్, వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు.
Share this article :

0 comments: