విద్యుత్ ప్లాంట్లు ఇక మూతే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ ప్లాంట్లు ఇక మూతే!

విద్యుత్ ప్లాంట్లు ఇక మూతే!

Written By news on Tuesday, August 7, 2012 | 8/07/2012


6 ప్లాంట్లు మూతపడే ప్రమాదం.. రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు చరిత్రగానే మిగిలిపోనున్నారుు. అసలే రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తిని తగ్గిస్తుండటం, పుండు మీద పుట్రలా వస్తున్న కాస్త గ్యాస్‌నూ రత్నగిరికి మళ్లిస్తుండటంతో భవిష్యత్తులో వునకు నికరంగా మిగిలే గ్యాసు రోజుకు 0.16 మిలియున్ క్యూబిక్ మీటర్లు (ఎంసీఎండీ) వూత్రమే. దీంతో కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ డీ-6లో రిలయున్స్ గ్యాసుపై ఆధారపడిన ఆరు విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సావుర్థ్యం (పీఎల్‌ఎఫ్-ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్) 4.2 శాతానికి పడిపోనుంది. దీనితో ఉత్పత్తి అయ్యే విద్యుత్ 13 మెగావాట్లు వూత్రమే. ఇంత తక్కువ సావుర్థ్యంతో ప్లాంట్లను నడపడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అంటే.. ఈ 6 విద్యుత్ ప్లాంట్లూ వుూతపడి, చరిత్ర ఆనవాళ్లుగానే మిగిలిపోయే ప్రమాదముంది. దీనివల్ల 3,356 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో 568 మెగావాట్లు వూత్రమే ఉత్పత్తి అయి, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుంది.

వుహారాష్ట్రలోని రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు గ్యాసు వుళ్లింపును నిలువరించకపోతే చివరకు జరిగేది ఇదే. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 విద్యుత్ ప్లాంట్లకు ఓఎన్‌జీసీ, రవ్వ క్షేత్రాలతో పాటు కేజీ డీ-6 నుంచి గ్యాసు వస్తోంది. వీటికి మూడు క్షేత్రాల నుంచి రావాల్సిన గ్యాసు 16.67 ఎంసీఎండీలు కాగా, వస్తున్నది 6.89 ఎంసీఎండీలు మాత్రమే. అంటే ఇప్పటికే 9.81 ఎంసీఎండీల గ్యాసు లోటు ఉంది. వీటిలో జేగూరుపాడు, స్పెక్ట్రమ్, సావుర్లకోట, ల్యాంకో కొండపల్లి స్టేజ్-1, విజ్జేశ్వరం ప్లాంట్లకు ఓఎన్‌జీసీ, రవ్వ క్షేత్రాలతోపాటు కేజీ డి-6 నుంచి కూడా గ్యాసు వస్తుంది. ఈ ప్లాంట్ల ఉత్పత్తి సావుర్థ్యం 999 మెగావాట్లు. వీటికి ఓఎన్‌జీసీ, రవ్వ క్షేత్రాల నుంచి రావాల్సిన గ్యాసు 6.27 ఎంసీఎండీలు కాగా, వస్తోంది 3.40 ఎంసీఎండీలు వూత్రమే. కేజీ డీ-6 నుంచి వీటికి 0.31 ఎంసీఎండీల గ్యాసు వస్తోంది. అరుుతే, గ్యాసు సరఫరా తక్కువగా ఉండటంతో ఈ ప్లాంట్లలో 517 మెగావాట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇవి కాకుండా వేవుగిరి, జీవీకే ఎక్స్‌టెన్షన్, గౌతమి, కోనసీవు విద్యుత్ ప్లాంట్లకు 7.38 ఎంసీఎండీలు అవసరమవగా, వీటికి సరఫరా అవుతున్న గ్యాసు 2.29 ఎంసీఎండీలు మాత్రమే. దీంతో 1,499 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ ప్లాంట్లలో ప్రస్తుతం 476 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. వీటితో పాటు రాష్ట్రంలోని వుర్చెంట్ విద్యుత్ ప్లాంట్లయిన ల్యాంకో కొండపల్లి స్టేజ్-2, జీఎంఆర్ బార్జ్ వంట్‌లకు 3.02 ఎంసీఎండీల గ్యాసు సరఫరా కావాల్సి ఉండగా, వీటికి రిలయున్స్ నుంచి 0.88 ఎంసీఎండీలు మాత్రమే వస్తోంది. అంటే వుర్చెంట్ ప్లాంట్లతో కలిపితే వునకు రిలయున్స్ నుంచి వస్తున్న గ్యాసు 3.48 ఎంసీఎండీలే. ఇందులో నుంచి 2 ఎంసీఎండీలు ఇప్పుడు రత్నగిరికి తరలిపోతోంది. ఇక వునకు మిగిలేది 1.48 ఎంసీఎండీలు వూత్రమే. కథ ఇక్కడితో ఆగలేదు. 2013-14 వరకు గ్యాసు ఉత్పత్తి తగ్గుతూనే ఉంటుందని కేంద్ర విద్యుత్ వుంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి వచ్చే వాటా కూడా మరింత తగ్గిపోతుంది. ఇదే జరిగితే రిలయన్స్ గ్యాస్‌లో చివరకు మనకు నికరంగా మిగిలేది కేవలం 0.16 ఎంసీఎండీలేనని ఇంధన శాఖ లెక్కగట్టింది. ఈ గ్యాసుతో ప్లాంట్లు నడిపితే వచ్చే విద్యుత్తు 13 మెగావాట్లే. ఇంత తక్కువ పీఎల్‌ఎఫ్‌తో ప్లాంట్లు నడపడం సాధ్యం కాదు. అంటే కేజీ డీ-6 గ్యాసుపై ఆధారపడిన ఆరు విద్యుత్ ప్లాంట్లు (వేవుగిరి, జీవీకే ఎక్స్‌టెన్షన్, గౌతమి, కోనసీవు, ల్యాంకో స్టేజీ-2, జీఎంఆర్ బార్జ్ వంట్) వుూతపడనున్నాయున్న వూట.

మరింత కరెంటు పోటు..!

మర్చెంట్ ప్లాంట్లతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాసు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సావుర్థ్యం 3,356 మెగావాట్లు. వీటికి సరఫరా అవుతున్న గ్యాసు 6.88 ఎంసీఎండీలే. దీంతో 1,318 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అరుుతే, రత్నగిరికి గ్యాసును మళ్లించడం, భవిష్యత్తులో గ్యాసు ఉత్పత్తే వురింత తగ్గనుండటంతో మన రాష్ట్రంలోని ప్లాంట్లు రిలయన్స్ నుంచి వచ్చే 0.16 ఎంసీఎండీలు, ఓఎన్‌జీసీ, రవ్వ గ్యాసుపై మాత్రమే ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు మన ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 568 మెగావాట్లు వూత్రమే. అంటే ఏకంగా 2,788 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోతుంది. ఇది 67 మిలియున్ యుూనిట్ల (ఎంయుు) విద్యుత్‌కు సవూనం. ఇప్పటికే గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి ఉత్పత్తి తగ్గిపోయి, విద్యుత్ కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రాని, ఇది మరింత సంక్షోభంలోకి నెడుతుంది.
Share this article :

0 comments: