రాష్ట్రవ్యాప్తంగా హైఆలర్ట్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రవ్యాప్తంగా హైఆలర్ట్!

రాష్ట్రవ్యాప్తంగా హైఆలర్ట్!

Written By news on Wednesday, August 1, 2012 | 8/01/2012

పూణె పేలుళ్ళ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ను ప్రకటించారు. పలు చోట్ల తనిఖీలు ప్రారంభించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. 


పుణె: పుణె పట్టణంలో ఐదు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పుణెలోని బాల గంధర్వ థియేటర్, డెక్కన్ రోడ్, గార్వేర్ కాలేజ్, జేఎం రోడ్డులో పేలుళ్లు జరిగినట్టు సమాచారం. ఈ పేలుళ్లలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. తక్కువ తీవ్రత కలిగిన పేలుళ్లలో ఓ సైకిల్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర కు చెందిన నేత కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఈ పేలుళ్లు జరగడం చర్చనీయాంశమైంది.
Share this article :

0 comments: