మాల్స్ తప్ప అన్నీ ఢమాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాల్స్ తప్ప అన్నీ ఢమాల్

మాల్స్ తప్ప అన్నీ ఢమాల్

Written By news on Wednesday, August 22, 2012 | 8/22/2012


అధికారికంగా విద్యుత్ కోతలు
వాణిజ్య సంస్థలకు మినహాయింపు
బడా మాల్స్, మల్టిప్లెక్స్‌లకు నిరంతర సరఫరా 
అధిక టారిఫ్ ఉండటమే ఇందుకు కారణం
పల్లెల్లో తాగునీటి పథకాలకు కరెంటు కరువు 
అన్ని రకాల పరిశ్రమలకూ భారీగా కోతలు
ఫక్తు వ్యాపార శైలిలో రాష్ట్ర సర్కారు తీరు
నగరాల్లో 3 గంటలు, జిల్లా కేంద్రాల్లో 5 గంటల కోత
పల్లెల్లో పగలంతా కరెంటు ఉండదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇక్కడ 24 గంటలూ వారంలో ఏడు రోజులూ నిరంతరంగా కరెంటు సరఫరా అవుతోంది! విద్యుత్ కోతలు అనేవే లేవు!! ఎక్కడ..? మన రాష్ట్రంలోనేనా..? అని ఆశ్చర్యపడొద్దు..! ఒక్కసారి బడా మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు వెళ్లి చూడండి..! రాష్ట్రమంతటా కోతలతో చీకట్లు అలముకున్నా... కరెంటు లేక గుక్కెడు నీటికి నోచుకోలేక పల్లెలు అలమటిస్తున్నా... ఈ వాణిజ్య సముదాయాలు మాత్రం ధగధగా వెలుగులతో మెరిసిపోతున్నాయి! ఎందుకంటే.. రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు, భారీ, చిన్నతరహా పరిశ్రమలనే తేడా లేకుండా విద్యుత్ కోతలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. వాణిజ్య సంస్థలకు మాత్రం ఈ కోతల నుంచి మినహాయింపునిచ్చింది. కారణం.. ప్రజల కష్టాలతో పనిలేదు.. పైసలొస్తే చాలన్న ఫక్తు వ్యాపార శైలే! విద్యుత్ సంస్థలకు వీటి ద్వారా భారీగా ఆదాయం రావటమే! రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విద్యుత్ కోతలను ట్రాన్స్‌కో మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పల్లెలు, పట్టణాలతో పాటు అన్ని రకాల పరిశ్రమలకు విద్యుత్ కోతలను అమలు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, సింగరేణి, తాగునీటి పథకాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు, రక్షణ రంగానికి కోతల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే.. పనిలోపనిగా వాణిజ్య సంస్థలకు కూడా కోతల నుంచి మినహాయింపునిచ్చేసింది. పైగా.. ఈ విషయాన్ని సదరు ప్రకటనలో పేర్కొనకపోవటం గమనార్హం.
అధిక ఆదాయం వస్తుందనే...: భారీ లైట్లు, పెద్ద పెద్ద కటౌట్లను పెట్రోమ్యాక్స్ లైట్లతో ఏర్పాటు చేసి భారీగా విద్యుత్‌ను వినియోగించే వాణిజ్య సంస్థలను ప్రభుత్వం కోతల నుంచి మినహాయించింది.

మొన్నటి వేసవిలో ఈ స్థాయిలో భారీ లోటు ఏర్పడినప్పుడు వాణిజ్య సంస్థలకు కేవలం 40 శాతం విద్యుత్‌నే సరఫరా చేశారు. అంటే ఏసీలు, భారీ లైట్లు వేసుకునేందుకు కాకుండా లైట్లకు మాత్రమే కరెంటు ఇచ్చారు. ఈసారి మాత్రం అపార ప్రేమ చూపించారు. ఎందుకంటే వాణిజ్య సంస్థలకు యూనిట్ విద్యుత్ ధర ఏకంగా రూ. 7 నుంచి రూ. 9 వరకూ ఉండటమే. భారీ ఆదాయుం వచ్చే వాణిజ్య సంస్థలకు కోతలను అవులు చేయుకపోవటానికి ఇదే కారణమని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఆదాయం ఎక్కువగా వచ్చే వాణిజ్య సంస్థలను కోతల నుంచి మినహాయిస్తున్నామని.. తక్కువ టారిఫ్ ఉండే గృహాలకు, పరిశ్రమలకు విద్యుత్ కోతలను సాధ్యమైనంత ఎక్కువగా అవులు చేస్తున్నావుని అంటున్నారు. ఈ వైఖరితో విద్యుత్ సంస్థలు ఫక్తు వ్యాపారం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాసంక్షేమాన్ని ఆలోచించాల్సిన ప్రభుత్వం.. ఈ విధంగా వ్యాపార దృష్టితో వ్యవహరించటాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు. 

చెప్పేది వేరు... చేసేది వేరు: ఇక పరిశ్రమలకు, గృహాలకు అధికారికంగా కోతల సమయాలు ప్రకటించినా.. వాస్తవంగా అంతకంటే ఎక్కువగానే కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో కూడా కరెంటు తీసేస్తుండటంతో.. ప్రజలు ఉక్కపోత, దోమలతో అవస్థలు పడుతున్నారు. తాగునీటి పథకాలకు కోతల్లేవని చెప్తున్నా.. వాస్తవంలో కోతలు విధిస్తున్నారు. దీంతో తాగునీరు లేక పల్లెలు అలమటిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయానికి ఏడు గంటలు కరెంటు సరఫరా చేయటంలేదని విద్యుత్ సంస్థలే అధికారికంగా చెప్తుంటే.. వ్యవసాయూనికి ఏడు గంటలు కోతలు లేకుండా సరఫరా చేస్తావుని ట్రాన్స్‌కో ప్రకటించటం విస్మయం కలిగిస్తోంది. 

డి మాండ్ దడ.. దడ..: రాష్ట్రంలో సోమవారం (20వ తేదీ) 275 మిలియున్ యూనిట్ల (ఎంయూ) డిమాండ్ నమోదు కాగా.. సరఫరా వూత్రం 208 ఎంయూలే ఉంది. రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుండటం, సరఫరా తగ్గుతుండటంతో విద్యుత్ సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రకటించిన కోతలను కొన్ని ప్రాంతాల్లో లో-టెన్షన్ (ఎల్‌టీ) స్థాయిలో సరిగ్గా అమలు చేయుకపోవటం వల్ల ఏకంగా హై-టెన్షన్ (హెచ్‌టీ) స్థాయిలోనే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఫలితంగా అధికారిక కోతల కంటే అనధికారిక కోతలే ఎక్కువవుతున్నాయి.
Share this article :

0 comments: