ఈనాడు కార్యాలయం స్థలం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ .తనదికాని స్థలానికి ప్రభుత్వ ప్రతిఫలం పొందిన రామోజీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనాడు కార్యాలయం స్థలం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ .తనదికాని స్థలానికి ప్రభుత్వ ప్రతిఫలం పొందిన రామోజీ

ఈనాడు కార్యాలయం స్థలం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ .తనదికాని స్థలానికి ప్రభుత్వ ప్రతిఫలం పొందిన రామోజీ

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012

* విశాఖలో ఈనాడు కార్యాలయం స్థలం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ
* తనదికాని స్థలానికి ప్రభుత్వ ప్రతిఫలం పొందిన రామోజీ
* రామోజీపై కుట్ర, మోసం, ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు
* రెండో నిందితుడిగా ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ కిరణ్

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఈనాడు’ అధినేత రామోజీరావు తనదికాని స్థలాన్ని రోడ్డు విస్తరణకు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి అక్రమంగా మరో స్థలాన్ని పొందిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే తొలగిపోవడంతో రామోజీరావుపై కుట్ర, మోసం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగంవంటి ఆరు సెక్షన్ల కింద ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు జరుగుతోందని ఏసీబీ డెరైక్టర్ జనరల్ బి. ప్రసాదరావు ‘న్యూస్‌లైన్‌కు తెలిపారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) ఎఫ్‌ఐఆర్ (నంబర్ 5/2012)ను నమోదు చేసింది. సీఐయూ చీఫ్ కె.సంపత్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. రామోజీరావును మొదటి నిందితునిగా, ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ఎండీ సీహెచ్ కిరణ్ రెండో నిందితునిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి స్థలాన్ని పొందడంలో రామోజీకి సహకరించిన ఐఏఎస్ అధికారులు ఎస్వీ ప్రసాద్, కేవీ రావులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో ‘ఈనాడు’ కార్యాలయమున్న స్థలాన్ని రామోజీరావు 1974లో మంతెన ఆదిత్య ఈశ్వర కుమార కృష్ణవర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. 1984-85లో ఈ స్థలంలో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. 

భూ యజమానికి ఈ సమాచారం ఇవ్వకుండా, రోడ్డు విస్తరణకు ఇచ్చిన స్థలానికి ప్రతిఫలంగా రేసపువానిపాలెం సర్వే నంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలాన్ని రామోజీరావు తన కుమారుడు కిరణ్ పేరిట తీసుకున్నారు. ఈ స్థలాన్ని ఇచ్చే అధికారం లేదని తహసీల్దార్ ఇచ్చిన నివేదికను కూడా కాదని, ఉన్నతాధికారులు రామోజీ కోరిన స్థలాన్ని 1985 ఏప్రిల్ 17న ఆయనకు కట్టబెట్టారు. దీనిపై భూ యజమాని వర్మ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. దీనిపై రామోజీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల హైకోర్టు స్టేను తొలగించడంతో ఏసీబీ దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.
Share this article :

0 comments: