'బంద్ సర్కార్ కు చెంపపెట్టు కావాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'బంద్ సర్కార్ కు చెంపపెట్టు కావాలి'

'బంద్ సర్కార్ కు చెంపపెట్టు కావాలి'

Written By news on Thursday, August 30, 2012 | 8/30/2012

అనంతపురం : ప్రభుత్వం చేతగానితనం వల్లే విద్యుత్ సంక్షోభం తలెత్తిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. అడ్డగోలు కోతలతో రైతులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన గురువారమిక్కడ అన్నారు.

విద్యుత్ కోతలకు నిరసనగా రేపు వైఎస్ఆర్ సీపీ చేపట్టనున్న బంద్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. విద్యుత్ కష్టాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో కరెంట్ కష్టాలు లేవని.... విద్యుత్ ఛార్జీల పెంపు కూడా లేదని పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు.
Share this article :

0 comments: