రాష్ట్ర ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు

రాష్ట్ర ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ మండిపాటు

Written By news on Tuesday, August 7, 2012 | 8/07/2012


ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, అందుకే మంత్రుల ఉప సంఘం ఆంక్షలను విధించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సోమవారమిక్కడ కొందరు మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెడితే.. దాన్నెలాగైనా నీరుగార్చాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇప్పటికే చిన్న పొరపాట్లను సాకుగా చూపి.. ఈ ఏడాది 2.5 లక్షల మంది విద్యార్థులను ఫీజుల పథకం నుంచి తప్పించారని.. మంత్రుల నిబంధనల వల్ల ఇంకా చాలా మంది విద్యార్థులు నష్టపోతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఫీజుల పథకానికి తూట్లు పొడుస్తున్న విషయాన్ని గ్రహించి మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలోనే హైదరాబాద్‌లో వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఈ పథకాన్ని రక్షించుకునేందుకు ఇప్పుడు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 12, 13 తేదీల్లో ఏలూరులో దీక్ష చేయ సంకల్పించారు’ అని చెప్పారు. 
Share this article :

0 comments: