'బీసీ టికెట్లపై రాజకీయం చేయొద్దు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బీసీ టికెట్లపై రాజకీయం చేయొద్దు'

'బీసీ టికెట్లపై రాజకీయం చేయొద్దు'

Written By news on Wednesday, August 22, 2012 | 8/22/2012

బీసీలకు టికెట్ల కేటాయింపుకు సంబంధించి రాజకీయం చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఈ విషయాన్ని చెప్పటం లేదని... గత ఏడాదే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల ప్రతినిధులు లోటస్ పాండ్ క్యాంప్ కార్యాలయంలో విజయమ్మతో భేటీ అయ్యారు. వందమంది బీసీలను చట్టసభలకు పంపుదామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బీసీ సంఘాల నేతలు అభినందించారు.
Share this article :

0 comments: