నిజాయతీకి బదిలీ బహుమతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజాయతీకి బదిలీ బహుమతి

నిజాయతీకి బదిలీ బహుమతి

Written By news on Friday, August 24, 2012 | 8/24/2012

* ఆయన స్థానచలనానికిముఖ్య నేత సోదరుడు, మంత్రి పట్టు?
* 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
* విశాఖ కమిషనర్, కలెక్టర్‌ల ఆధిపత్యపోరుతో ఇద్దరికీ స్థాన చలనం
* పోస్టింగ్‌లు ఇవ్వని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముక్కుసూటి అధికారిగా, నిజాయతీపరుడిగా పేరున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి రాజకీయాలకు బలయ్యారు. ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇద్దరు జిల్లా కలెక్టర్లతోపాటు మరో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావును సరెండర్ చేయడంపై ఆగ్రహించిన ముఖ్యనేత సోదరుడు, ఆ శాఖ మంత్రి.. కలెక్టర్ శేషాద్రి బదిలీకి పట్టుబట్టినట్లు ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన శేషాద్రిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. 

సుబ్బారావు సరెండర్ వ్యవహారంతోపాటు శంషాబాద్‌లో వంద కోట్ల సర్కారీ భూమికి నగరానికి చెందిన మంత్రి ఎసరు పెట్టిన నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం బదిలీ చేసిందన్న వాదన వినిపిస్తోంది. పైగా.. మూడ్రోజుల క్రితం సదరు మంత్రి ఆ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులను పిలిచి.. తమ పనికి ‘లైన్ క్లియర్’ అయిందని.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, విలేకరులతో అస్సలు మాట్లాడవద్దని చెప్పడం గమనార్హం. అదే విధంగా విశాఖ కలెక్టర్ లవ్ అగర్వాల్, విశాఖ కార్పొరేషన్ కమిషనర్ రామాంజనేయులు మధ్య కొద్ది కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. వారిద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 
Share this article :

0 comments: