అన్నా దీక్ష విరమణ - పార్టీ ప్రకటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్నా దీక్ష విరమణ - పార్టీ ప్రకటన

అన్నా దీక్ష విరమణ - పార్టీ ప్రకటన

Written By news on Friday, August 3, 2012 | 8/03/2012

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త, జనలోక్ పాల్ బిల్లు ఉద్యమ నేత అన్నా హజారే జంతర్ మంతర్ వద్ద ఈ సాయంత్రం 6 గంటలకు తన దీక్ష విరమించారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. లోక్ పాల్ బిల్లు ప్రవేశపెడితే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతానన్నారు. తాము పెట్టే రాజకీయ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. పార్టీకి అధిష్టానం అంటూ ఏమీ ఉండదని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. తాను ఎన్నికలలో పాల్గొనని చెప్పారు. అవినీతిలో పోరుపై తాను యువత వెంటే ఉంటానని అన్నా ప్రకటించారు.


అన్నా హజారే బృందం దారితప్పుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు విమర్శించారు. లోక్ పాల్ బిల్లుకు పరిష్కారం చూపకుండా రాజకీయ పార్టీ ఆలోచన సరికాదన్నారు. ఉద్యమాన్ని ఢిల్లీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తం చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: