జగన్ కోసం - 13 (పాఠకుల స్పందన) sakshi - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్ కోసం - 13 (పాఠకుల స్పందన) sakshi

జగన్ కోసం - 13 (పాఠకుల స్పందన) sakshi

Written By news on Sunday, September 30, 2012 | 9/30/2012

‘‘జగన్ కోసం’’ అనే ఒక మంచి శీర్షికను ప్రారంభించి పాఠకుల అభిప్రాయాలకు గౌరవం కల్పించి మా మనోవ్యధ పంచుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు సర్వదా ఋణగ్రస్థులం. 9 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ అనే వృక్షం కూకటివేళ్ళతో సహా పెకలించబడిన సమయంలో ‘అపర భగీరధుడు’ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి కొడిగట్టిపోతున్న కాంగ్రెస్ దీపానికి చేతులు అడ్డుపెట్టి దేదీప్యమానంగా ప్రకాశింపచేసి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చారు ఆ మహానుభావుడు. కాని ఎంత అన్యాయం? ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కావచ్చు, వారి బిడ్డ భారతదేశానికి ప్రధాని అవ్వాలని వారు ఆశపడొచ్చు. కాని రాజశేఖరుడు ఊపిరిపోసిన (కాంగ్రెస్) రాజ్యానికి ఆయన కుమారుడు సిఎం కావాలని మాలాంటి సామాన్య ప్రజలు కోరుకోవటం మాత్రం సోనియాకు, కొంతమంది సీనియర్లకు కంటగింపుగా మారింది. 

తండ్రి చనిపోయిన బాధలో ఉంటే జగనే ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరించినవారే ఇప్పుడు జనమే నాయకుడుగా జగన్‌ను కోరుకొంటుంటే ఈర్ష్యతో నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో చచ్చిపోయిన కాంగ్రెస్‌ను బ్రతికించిన పాపానికి పెద్దాయన ఎలా మరణించారో ప్రజలకు కనీస వివరణ ఇవ్వలేదు సరికదా మా మీద ప్రేమతో ఓదార్పుయాత్ర చేస్తానని మాటఇచ్చి మండుటెండలో ఏ నాయకుడూ చేయని పని చేసిన ఆ ప్రేమమూర్తికి రాజకీయ కక్షతో కళంకం అంటగట్టి అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి పంపినట్లు, కాంగ్రెస్, టిడిపి సీనియర్లు కుమ్మకై జగనన్నను జైల్లోకి పంపారు.

కాని ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే ఆ అభిమన్యుడికి జనం బలం లేదు. కానీ ఈ అభిమన్యుడికి అవసరం అయితే ప్రాణత్యాగం చేసేంత అభిమానం ఉన్న ‘జనబలం’ ఉంది. మామను వెన్నుపోటు పొడిచి, వారసుడి కూతుర్ని కోడలిగా చేసుకుని అతని నోరు మూయించి, అధికార దాహంతో ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి రెండుసార్లు సింహం చేతుల్లో చిత్తుగా ఓడిపోయి చావుతప్పి కన్నులొట్టపోయి, ఇప్పుడు బిసి, ఎస్‌సి పాట పాడే నాయకులకు, సోనియాగాంధీ కాళ్ళ దగ్గర వుంటే చాలు ప్రజాసేవ చేయకపోయినా పదవులు వాటంతట అవే వస్తాయని అనుకునే కొంతమంది సీనియర్లకు మేము త్వరలో బుద్ధిచెబుతాం.
అమ్మా విజయమ్మా! తల్లీ భారతీ! సోదరీ షర్మిల! మీకు కోట్లమంది కుటుంబ సభ్యులున్నారు. మా గుండెల్లో మీరున్నారు.
- నాగమల్లేశ్వరి, గుండాల, గుంటూరు జిల్లా


ప్రజల నడ్డి విరచడానికే జగన్ అరెస్ట్
నా పేరు పద్మ. జగనన్న అంటే మాకు ఎంతో ప్రాణం. ఎందుకంటే రాజశేఖరరెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు ఎంత మేలు చేశాయో ఆ పథకాలు అందుకున్న వారిలో నేనూ ఒక దానిని. నాకు వై.ఎస్.ఆర్ ఉన్నంత కాలం వికలాంగుల ఫించను అందింది. వై.ఎస్.ఆర్ ఎప్పుడైతే దురం అయ్యారో అప్పటి నుంచే నాకు ఫించను అందడం లేదు. అసలు వై.ఎస్.ఆర్ లేనప్పుడు ఈ ఫించను ఎందుకు అనిపించింది. ఓదార్పు యాత్రలో ప్రజల కోసం ఎండనకా వాననకా తీవ్ర జ్వరంలోను ఓదార్పు యాత్ర చేసిన వ్యక్తి జగనన్న. అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా చేయడం కావాలని సోనియాగాంధి చేస్తున్న పని. ఈమె కూడా ఒక తల్లే కదా. ఒక తల్లిగా విజయమ్మ మనసు ఎంత క్షోభకు గురవుతుందో సోనియా గాంధీకి ఎందుకు అర్థం కావడంలేదు. విచారణ పేరుతో జగనన్నను జైల్లో పెట్టినప్పుడు ఎంతమంది ఇళ్ళలో పొయ్యి వెలగలేదో ఈ సి.బి.ఐ వారికి ఏమి తెలుస్తుంది?

ఈ కేంద్ర ప్రభుత్వానికి, కిరణ్ సర్కార్‌కు ఒక్కటే భయం. జగనన్న బయట ఉంటే వారికి రేట్లు పెంచడానికి, ఫీజు రీయంబర్స్‌మెంట్ నిలిపి వేయడానికి, పేద ప్రజల నడ్డి విరవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే జగనన్న నిత్యం ప్రజల కోసం జీవించే వ్యక్తి కనుక ప్రజల పక్షాన నిలచి నిరాహార దీక్షలు చేయటం, ధర్నాలు చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే జగనన్నను జైల్లో ఉంచి ప్రజల నడ్డి విరుస్తోంది ఈ సర్కారు. అసలు ఆయన చేసిన తప్పేంటి? ఓదార్పు చేయడమే జగనన్న చేసిన తప్పా? అది తప్పే అయితే మరి చిరంజీవి పీఆర్పీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ని ఎంతగా తిట్టాడు. అది తప్పుకాదా! పేద ప్రజల వద్దకు వచ్చి వారి కష్టాలు తెలుసుకుని వారికి ప్రేమ పంచడం తప్పు ఎలా అవుతుంది. కని పెంచిన కన్న తండ్రి చనిపోయిన రోజున కనీసం ఆయన సమాధి దగ్గరకు కూడా వెళ్లడానికి అవకాశం ఇవ్వకుండా జైల్లో పెట్టి సీబీఐ వారు కాలక్షేపం చేయడం ఎంత దుర్మార్గపు చర్య. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ముగుస్తుంది. ఇటువంటి రాక్షస ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఏలుతుందంటే చాలా చాలా సిగ్గుగా ఉంది.

విజయమ్మ గారూ మీరు బాధపడకండి. మీ ప్రార్థన ఆ దేవుడు తప్పక వింటారు. తప్పకుండా జగనన్న తొందరగా బయటికి వచ్చి వీళ్ళందరికి బుద్ది చెప్త్తారు. జగనన్న తొందరగా విడుదల కావాలని ప్రార్థిస్తూ నిత్యం జగనన్న వెంటే ఉండే ఓ పెద్ద అభిమాని, కాదు చెల్లి.
- పద్మ, నర్సరావుపేట


మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: