జగన్ రిమాండ్ 25 వరకు పొడిగింపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ రిమాండ్ 25 వరకు పొడిగింపు

జగన్ రిమాండ్ 25 వరకు పొడిగింపు

Written By news on Wednesday, September 12, 2012 | 9/12/2012

 తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 25 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు 25 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ ముగియడంతో మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. 

అలాగే జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన మూడు చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి, ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్ పూర్వ ఎండీ పి.శరత్‌చంద్రారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యద్దనపూడి విజయలక్ష్మీ ప్రసాద్, అరబిందో ఫార్మా కంపెనీ సెక్రటరీ పీఏసీ చంద్రమౌళి, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి, జగతి, జనని తరఫున కంపెనీ సెక్రటరీ సీపీఎన్ కార్తీక్‌తోపాటు నిందితుల జాబితాలో ఉన్న కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. వీరి హాజరును న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు. ఈ మూడు చార్జిషీట్ల విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న హెటిరోకు చెందిన శ్రీనివాసరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిలు అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నామంటూ దాఖలు చేసుకున్న మెమోను కోర్టు అనుమతించింది.
Share this article :

0 comments: