'వైఎస్ పై కక్షతో విద్యార్థులను వేధిస్తున్నారు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ పై కక్షతో విద్యార్థులను వేధిస్తున్నారు'

'వైఎస్ పై కక్షతో విద్యార్థులను వేధిస్తున్నారు'

Written By news on Friday, September 7, 2012 | 9/07/2012

పెద్ద చదువులు పేదల హక్కుగా ప్రభుత్వం భావించటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌వద్ద ఫీజు దీక్ష చేస్తున్న ఆమె శుక్రవారం 'సాక్షి'తో మాట్లాడారు. వైఎస్ ఆర్ పై కక్షతో ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ఫీజు పథకం సక్రమంగా అమలు అవుతోందని సీఎం, మంత్రులు చెప్పగలరా అని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి చేవలేదని, చేతగానిదని విజయమ్మ విమర్శించారు. నిరుపేదలకు ఏం చేయాలో, ఎలా చేయాలో వైఎస్‌ నిరూపించారన్నారు. చదువులపై పెట్టుబడిని వైఎస్ సామాజిక పెట్టుబడిగా భావించారన్నారు. అదే వైఎస్ విజన్ అని ఆమె అన్నారు. చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఓ విద్యార్థి అయినా చెబుతారా అని సూటిగా ప్రశ్నించారు. బీసీల పట్ల బాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో గత ఎన్నికల్లో చూశామని విజయమ్మ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: