కేంద్రానికి మమతా బెనర్జీ షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రానికి మమతా బెనర్జీ షాక్

కేంద్రానికి మమతా బెనర్జీ షాక్

Written By ysrcongress on Tuesday, September 18, 2012 | 9/18/2012

కేంద్ర ప్రభుత్వంనుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలగాలని మంగళవారం సాయంత్రం నిర్ణయించుకుంది. కేంద్రం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడానికి ముందు తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ నాయకత్వంలో కలకత్తాలో ఆ పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. తృణమూల్‌కు చెందిన కేంద్ర మంత్రులు శుక్రవారంనాడు తమ పదవులకు రాజీనామా చేస్తారని తృణమూల్ వర్గాలు వెల్లడించాయి. 

కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఎ. సంకీర్ణ ప్రభుత్వం నుంచి నిష్క్రమించాలని కలకత్తా సమావేశంలో నిర్ణయించారు. అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంనుంచి దేశం దృష్టిని మరల్చడానికే కేంద్రం ఎఫ్.డి.ఐ.లను రంగంమీదికి తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రం పదే పదే ధరలు పెంచుతున్నందున తమకు గత్యంతరం లేని పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె చెప్పారు. కేంద్రంలో తమకు సరైన గౌరవం లభించడం లేదని, డీజిల్ ధరల పెంపు విషయంలో గాని, గ్యాస్ సిలిండర్ల తగ్గింపు విషయంలో గాని, రిటైల్ రంగంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విషయంలో గాని కేంద్ర ప్రభుత్వం తమతో సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది. 
Share this article :

0 comments: