పేదరికం అడ్డుకాకూడదు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదరికం అడ్డుకాకూడదు: విజయమ్మ

పేదరికం అడ్డుకాకూడదు: విజయమ్మ

Written By news on Friday, September 7, 2012 | 9/07/2012

అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఫీజు రీయింబర్స్‌ ఇవ్వాలన్నదే వైఎస్‌ఆర్‌ ఆశయమని ఇందిరాపార్క్ లో రెండు రోజులుగా చేపట్టిన ఫీజు దీక్ష ముగింపు సందర్బంగా మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ అన్నారు. విద్యార్థినులు ప్రియాంక, నవీనాలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..చదువులకు పేదరికం అడ్డుకాకూడదని మహోన్నతమైన ఆశయంతో మహానేత వైఎస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని విజయమ్మ తెలిపారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని సర్కార్‌ ఎందుకు అమలు చేయలేకపోతోందని, ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత కాదా అని విజయమ్మ ప్రశ్నించారు. వేల కోట్లు రూపాయల్ని పన్నులుగా ఈ ప్రభుత్వం వసూలు చేస్తుందని, ఫీజు రీయింబర్స్‌ కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడుతుందని వైఎస్‌ విజయమ్మ మండిపడ్డారు. గత ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌పై పోరాడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆమె విమర్శించారు. 

30ఏళ్లు ప్రజల మధ్య తిరిగిన మహానేత వైఎస్‌ఆర్‌ అని, ప్రజా సమస్యలు ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియవని విజయమ్మ అన్నారు. ప్రజల కోసం మహానేత ఎప్పుడు బడ్జెట్‌ లెక్కలు వేయలేదని అని అన్నారు. రైతులకు వైఎస్ఆర్‌ చేసిన సేవ ఎనలేనివన్నారు. వైఎస్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌ కూడా అమలు కావడం లేదని, ప్రతిపక్షం కూడా ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని, ప్రజా సమస్యల కోసం పోరాడటంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ విజయమ్మ ఆరోపించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కవ్వడం చరిత్రలో లేదని, వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలవడం, అమీర్‌పేట భూములు కూడా కుమ్మక్కేనని ఆమె వ్యాఖ్యానించారు. 

జీవో 26లో ప్రభుత్వ స్థానంలో వైఎస్‌ఆర్‌ పేరు చేర్చారని, 52వ ముద్దాయిగా ఉన్న జగన్‌ను మొదటి ముద్దాయిగా చేశారని, సీబీఐ చర్య కూడా పెద్ద కుట్రేనని వైఎస్‌ విజయమ్మ అన్నారు.
Share this article :

0 comments: