ప్రజల గురించే జగన్ ఆలోచన:విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల గురించే జగన్ ఆలోచన:విజయమ్మ

ప్రజల గురించే జగన్ ఆలోచన:విజయమ్మ

Written By news on Wednesday, September 12, 2012 | 9/12/2012

పామర్రు: వైఎస్ జగన్మోహన రెడ్డి జైలులో ఉన్నా జనం గురించే ఆలోచిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు  విజయమ్మ  చెప్పారు. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రజలు తమ పట్ల చూపే ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. మీ ప్రేమాభిమానాలు జగన్ కు తెలియజేస్తానని చెప్పారు. జగన్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వాగ్దానాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాగోగులు ఈ ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. వైఎస్ మరణం తరువాత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకోవాలన్నారు. వైఎస్ హయాంలో ప్రజలపై ఎలాంటి పన్నులభారం వేయలేదని గుర్తు చేశారు. దేశచరిత్రలోనే ఒక్క రూపాయి పన్నుపెంచకుండా వైఎస్ ప్రభుత్వం రికార్డ్ సాధించిందన్నారు. ప్రతి ఒక్కరికీ తానున్నాని వైఎస్ఆర్ భరోసా కల్పించారన్నారు. వైఎస్ఆర్ రెక్కలకష్టంపై వచ్చిన ఈ ప్రభుత్వం ఆయనిచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసిందని బాధపడ్డారు. రైతు నాగలి పట్టే పరిస్థితి, నేతన్న మగ్గం నేసే స్థితి లేదన్నారు. లక్షలాది కుటుంబాలు ఆకలితో మలమలలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వెనుకాడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ లో తమపార్టీ విలీనాన్ని తాను ఖండించలేదని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ సీపీని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ సంతాప సభ పెట్టడానికి శాసనసభలో 3 నెలలు పట్టిందన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వందల మంది చనిపోతే కాంగ్రెస్ నేతలు ఏరోజైనా పరామర్శించారా? అని మంత్రులను ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ సజీవంగా నడిచొస్తే ఆయన కళ్లల్లోకి సూటిగా చూడగలరా? అని అడిగారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం అని, త్వరలో మన ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చారు. న్యాయం, ధర్మం మనవైపే ఉన్నాయన్నారు. వైఎస్ సువర్ణయుగం కోసం అందరం కలిసిపనిచేద్దామని పిలుపు ఇచ్చారు. పార్టీలో చేరిన నేతలకు క్రియాశీల సభ్యత్వ పత్రాలను విజయయ్మ అందజేశారు.
Share this article :

0 comments: