ప్రభుత్వం ఒక వాణిజ్య సంస్థలా మారి లాభనష్టాల గురించి ...... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వం ఒక వాణిజ్య సంస్థలా మారి లాభనష్టాల గురించి ......

ప్రభుత్వం ఒక వాణిజ్య సంస్థలా మారి లాభనష్టాల గురించి ......

Written By news on Friday, September 14, 2012 | 9/14/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: డీజిల్ ధరను రూ.5 పెంచడం, గృహ వినియోగ అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. గృహ అవసరాల కోసం ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు మాత్రమే ప్రస్తుత ధరకు కేటాయిస్తామంటూ, ఆ పైన కావాలంటే ఒక్కొక్క సిలిండర్‌కు రూ.750 చెల్లించాలని చెప్పడాన్ని తాము తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు పేర్కొన్నారు.

పభుత్వం ఒక వాణిజ్య సంస్థలా మారి లాభనష్టాల గురించి ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. డీజిల్ ధర పెంచడంతో మొత్తంగా ప్రతి వస్తువు రేటు పెరుగుతుందన్నారు. ఒకవైపు పేదల కొనుగోలు శక్తి పెరగకపోవడం, మరోపక్క విద్యుత్ కొరత కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలవుతున్న పరిస్థితుల్లో ప్రజలపై భారం మోపడం ప్రభుత్వ బాధ్యత కాదని విజయమ్మ పేర్కొన్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచినా, ఇక్కడి ఆడపడుచుల మీద ఆ భారం పడకూడదనే అభిప్రాయంతో ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి భరోసా ఇవ్వాలని విజయమ్మ కోరారు.
Share this article :

0 comments: