వాన్ పిక్ విచారణ ఏకపక్షంగా ఉందా-హైకోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాన్ పిక్ విచారణ ఏకపక్షంగా ఉందా-హైకోర్టు

వాన్ పిక్ విచారణ ఏకపక్షంగా ఉందా-హైకోర్టు

Written By news on Thursday, September 20, 2012 | 9/20/2012

జగన్ ఆస్తుల కేసులో హైకోర్టు కీలకమైన ప్రశ్నలు వేసింది. ముఖ్యంగా వాన్ పిక్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ ఒక్కరినే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించడమే కాక, ఈ కేసులో ఏకపక్షంగా విచారణ జరుగుతోందా అని కూడా హైకోర్టు ప్రశ్నించడం ఆసక్తికరం. వాన్ పిక్ కేసులో రస్ ఆల్‌ ఖైమా పాత్ర గురించి ఎందుకు చెప్పడం లేదని హైకోర్టు సిబిఐని అడిగింది. నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ కు అభ్యంతరాలేమిటో చెప్పకుండా కేసు లోతుపాతుల గురించి చెబుతున్నారేమిటని కూడా హైకోర్టు అడగడం విశేషం.విచారణకు ఇంకేం మిగిలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాని, కేసు పూర్వాపరాలు కాని, హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన నేపధ్యం కాని హైకోర్టు న్యాయమూర్తులకు తెలియకుండా ఉండజాలవు. అయినా చట్టప్రకారం వారు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అయితే జగన్ కేసు విచారణకు ఆదేశించినప్పుడు అలా జరగలేదన్న విమర్శను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారు. అయితే కేసు విచారణ పురోగతిని బట్టి అనేక విషయాలు రావచ్చు. అయితే ఇప్పటికే సిబిఐ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్టు చేయడంతో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేసే పరిస్థితులు నెలకొన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయినప్పట్టికీ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తే ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలులేదు.అలా జరుగుతుందా అన్నదే అందరిలోను వ్యక్తం అవుతున్న ప్రశ్న. అదే ప్రశ్నను ఇప్పుడు హైకోర్టు వేసినట్లు కనబడుతోంది.అయితే సిబిఐ తరపు న్యాయవాది మాత్రం వాన్ పిక్ కేసులో ఆల్‌ ఖైమా సిఇఓ కు నోటీసు జారీ చేసినట్లు తెలిపింది.కేసు విచారణను కోర్టు కొనసాగించడానికి అభ్యంతరం ఎవరికి ఉండదు. ఈలోగానే నిందితులను ఎక్కువకాలం జైలులో ఉంచడానికి సిబిఐ చేస్తున్న ప్రయత్నం మీదే విమర్శలు వస్తున్నాయి.ఏది ఏమైనా సమంజసమైన రీతిలో ఈ కేసులో నిర్ణయాలు వస్తాయని ఆశించాలి.
http://kommineni.info/articles/dailyarticles/content_20120920_10.php
Share this article :

0 comments: