వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకులు

వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు అడ్డంకులు

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

తిరుపతి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. విగ్రహాల ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటూ ఆటంకాలు సృష్టిస్తున్నారు.భారీగా పోలీసులను మోహరించి విగ్రహాల ఏర్పాటును అడ్డుకుంటున్నారు. రేపు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా150 విగ్రహాల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి సర్వ సిద్ధం చేశారు. దీనిలో భాగంగా చంద్రగిరిలో విగ్రహాల ఏర్పాటు చేస్తుండగా పోలీసులు విగ్రహాల ఏర్పాటును అడ్డుకున్నారు. సర్కారు విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

పేద ప్రజలకు మూడు పూటలా అన్నం పెట్టిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డని, అటువంటి మనిషి విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాల ఏర్పాటుకు మూడ అడుగుల స్థలం ఇవ్వకపోవటం బాధాకరమని ఆయన అన్నారు.
Share this article :

0 comments: