బంద్ విఫలమంటూ ఓ వర్గం మీడియా వివక్షాపూరిత ధోరణి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » బంద్ విఫలమంటూ ఓ వర్గం మీడియా వివక్షాపూరిత ధోరణి

బంద్ విఫలమంటూ ఓ వర్గం మీడియా వివక్షాపూరిత ధోరణి

Written By news on Saturday, September 1, 2012 | 9/01/2012

 ప్రజా సమస్యలను పరిష్కరించటానికి తమ వంతు కృషి చేయాల్సిన మీడియాలోని ఒక వర్గం.. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజలకు మద్దతుగా చేపట్టిన బంద్ పట్ల కూడా వివక్షా పూరితంగా వ్యవహరించటం పట్ల సీనియర్ పాత్రికేయులు, మీడియా రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ తమకు బద్ధ శత్రువన్నట్లు వ్యవహరిస్తున్న ఆ వర్గం మీడియా చానళ్లు.. విద్యుత్ సంక్షోభంపై ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును.. మీడియా ప్రమాణాల ప్రకారం కనీసం ప్రసారం కూడా చేయలేదు. 

ఆ పిలుపు ప్రజల వద్దకు వెళ్లకుండా చూసే ఉద్దేశంతోనే అలా వ్యవహరించాయన్న విమర్శలూ ఉన్నాయి. మరోవైపు.. శుక్రవారం తెల్లవారీ తెల్లవారకముందే అవే టీవీ చానళ్లు బంద్ విఫలం అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయటం మొదలు పెట్టాయి. బస్సులు తిరుగుతున్నాయని, కార్యాలయాలు తెరవకముందే తెరిచారని కథనాలు అల్లుతూ.. బంద్ ప్రభావం ఏమీ లేదన్నట్లుగా ప్రజలకు భ్రాంతి కలిగించేందుకు ప్రయత్నించాయి. ఈ వివక్షా పూరిత ధోరణిని మీడియా రంగ నిపుణులు సైతం తప్పుపడుతున్నారు. 
Share this article :

0 comments: