గ్యాస్‌పై మన హక్కు హుళక్కేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ్యాస్‌పై మన హక్కు హుళక్కేనా?

గ్యాస్‌పై మన హక్కు హుళక్కేనా?

Written By news on Saturday, September 8, 2012 | 9/08/2012


రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో 10 శాతం తెలుగు ప్రాంతానికి దక్కాలని వైఎస్ ఆనాడే కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ సాధికార మంత్రుల కమిటీ వద్ద పెండింగులో ఉంది. దీనికి విరుద్ధంగా కేటాయింపులు జరిగాయి. గ్యాస్‌ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం కారణంగా రాయల్టీ వసూలు చేస్తే కోట్లాది రూపాయలు రాష్ట్రానికి ఆదాయంగా వస్తాయి. కానీ, ఈ విషయాన్ని ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటింటికీ గ్యాస్ పైపులైను ఏర్పాటుపై సన్నాహాలు మొదలయ్యాయి. కానీ ఆయన అకాల మరణం తెలుగు జాతికి శాపంలా పరిణమించింది.

రాజకీయాల్లో సమర్థులు అతిసహజంగా మంచి పనులు చేసి ప్రజల మన్ననకు పాత్రులవుతుంటారు. అసమర్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రజలను కష్టాల పాలు చేస్తుంటారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వానిది రెండవ తరహా. అందుకే అది అసమర్థపాల నకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తోంది. చేతగానితనాన్ని పుణికిపుక్చుకున్న కేంద్రం, రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం తలపెట్టే నిర్ణయా లతో కపటనాటకాలాడుతోంది. రాష్ట్రానికి కేటాయించిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలి స్తుంటే మొద్దునిద్ర నటించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇందుకు తాజా నిదర్శనం.

అసలే విద్యుత్ కొరతతో అల్లాడిపోతూ అంధకారప్రదేశ్‌గా ఆంధ్ర ప్రదేశ్ దిగజారుతున్న దుస్థితిలో విద్యుత్ సంక్షోభాన్ని మరింతగా పెంచే దిశగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన, కేంద్రప్రభుత్వ నిర్వాకం తెలుగువారందరినీ విస్మయానికి గురిచేసింది. విద్యుత్ కొరత మూలంగా ప్రజలు పడుతున్న బాధలను పరిష్కరించాలనే చిత్తశుద్ధిగానీ, ఆలోచనగానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేవని ఈ తరలింపు తేటతెల్లం చేసింది. రాజకీయ పక్షాలు గగ్గోలు పెట్టడం, పత్రికల్లో వార్తా కథ నాలు వెలువడటంతో మొద్దునిద్ర నుంచి మేల్కొని తాత్కాలిక సర్దుబాటు ఏదో చేసినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుంది.

గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల మూతకు కుట్ర!
రాష్ట్రంలోని కోస్తా తీరప్రాంతంలో రియలన్స్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌లో కొంత భాగాన్ని రాష్ట్రంలో నెలకొల్పే గ్యాస్ ఆధారిత విద్యుత్తు సంస్థలకు కేటాయించారు. కానీ క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే గ్యాస్ కోటాను తగ్గిస్తూపోతున్నారు. పరిస్థితులు, పరిణామాలు లోతుగా పరిశీలించి, విశ్లేషిస్తే, రియలన్స్ సంస్థ రానున్న కాలం లో గ్యాస్ ఆధారిత విద్యుత్తు సంస్థలకు గ్యాస్ కోటాను కుదించడంతో పాటు, క్రమంగా గ్యాస్ రేటును పెంచుకోవడం ద్వారా గ్యాస్ కొనుగోలు చేయలేని స్థితికి పర్రిశమలను నెట్టి, తదనంతరం వాటిని మూసివేసేందుకు రోడ్‌మ్యాప్ వేస్తోందనే అనుమానం కలుగుతుంది. ఇతర రాష్ట్రాలకు అధిక లాభాలకు గ్యాస్ అమ్ముకునేందుకే ఈ ఎత్తుగడ పన్నిందనే వాదన వినిపిస్తోంది.

ఎంత ఉత్పత్తి చేయాలి? ఎంత ఇవ్వాలి?
రియలన్స్ సంస్థ 2009-10 సంవత్సరంలో రోజుకి 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీ ఎండీ) గ్యాస్‌ను 2011-12 నాటికి 80 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌నూ ఉత్పత్తి చేయాల్సి ఉంది. అంచనాల ప్రకారం గ్యాస్ ఉత్పత్తి జరిగి ఉంటే విద్యుత్, ఎరువుల కర్మాగారాలకు సంబంధించి అది సంతోషకర మైన వార్తే అయి ఉండేది. రిలయన్స్ సంస్థ ఉద్దేశపూర్వకంగా చేసిందో, ముందస్తు లాభాపేక్ష వ్యూహంతో చేసిందోగాని అంచనాల మేరకు గ్యాస్ ఉత్పత్తి జరగలేదు. 2009-10లో 70 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీ ఎండీ)కు గాను, కేవలం 42 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి చేయగలమని ముందు చెప్పినా చివరకు 29 మిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే ఉత్పత్తి చేసింది.

దీనితో రియలన్స్‌ను నమ్ముకొని కోటానుకోట్ల రూపాయల పెట్టుబడు లతో ఉత్పత్తి లక్ష్యాలు పెంచుకోవాలనుకున్న విద్యుత్ సంస్థలు, ఏటేటా ఉత్పత్తిని కుదించుకునే దుస్థితికి దిగజారాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలకు తగిన గ్యాస్ లభించి ఉండి ఉంటే, వాటి సామర్థ్యం మేర అవి విద్యుత్తును ఉత్పత్తి కనుక చేసి ఉంటే రాష్ట్రంలో ఇంత దారుణంగా విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది కాదు. ఎంతో కొంత వెసులుబాటు కలిగి ఉండేది. కానీ రిలయన్స్ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఖాతరుచేయక రాష్ట్రానికి చెందిన వనరులను సొంత జాగీరుగా భావిస్తూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతోంది.

గోరుచుట్టుపై రోకలిపోటు!
ఇస్తామన్న గ్యాస్ ఇవ్వని కారణంగా, ఒకపక్క గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు, ఎరువుల కర్మాగారాలు లబోదిబోమంటుండగా, గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా కేంద్రం ఒక తప్పుడు నిర్ణయంతో రాష్ట్ర ప్రజల నెత్తిన సుత్తి దెబ్బ వేసింది. అదేమిటంటే, రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు ఇస్తున్న గ్యాస్‌లో కోతపెట్టి, ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి విద్యుత్ ప్రాజెక్టుకు సుమారు 37 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ తరలించాలని నిర్ణయించింది. 11 నెలల క్రితమే ఈ ప్రతిపాదన కేంద్ర సాధికార మంత్రుల బృందం ఆమోదిం చింది. దీని అమలు ఫలితంగా, రాష్ట్రంలో జరగాల్సి ఉన్న ఉత్పత్తిలో 400 మెగావాట్ల మేరకు నష్టం కలుగుతుంది. అసలే కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి ఇది సమ్మెట పోటులాంటిది.

రాష్ట్ర ప్రజల అవసరాలకు కావలసిన విద్యుత్ 258 మిలియన్ యూనిట్లు మాత్రమే! కొరత 46 మిలియన్ యూనిట్లు. ఈ నేపథ్యంలో అన్నిరకాల విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. రాష్ట్రం తరపున కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీలపైన ఉంది. కానీ ఉత్పత్తిని పెంచుకునే అవకాశాలపై వీరు దృష్టిసారించకపోగా ఉన్న అవకాశాలపై గండికొడుతూ, రాష్ట్రం నోటిదగ్గర బువ్వను మహారాష్ట్రకు గ్యాస్ రూపంలో అందిస్తుంటే, వీరంతా చేష్టలుడిగి చూడటం విడ్డూరం.

మన తెలుగోడు జైపాల్ ఏం చేస్తున్నాడు?
ఇంత జరుగుతుంటే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న మన తెలుగువాడు జైపాల్‌రెడ్డి ఏం చేస్తున్నట్లు? ‘‘11 నెలల కిందే కిరణ్‌ని ప్రధానిని కలవమన్నాను. ఇంతకన్నా నేను చేసేది ఏముంది!’’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పదవి ముఖ్యమా! ప్రజలు ముఖ్యమా అనేది ఖచ్చితంగా బేరీజు వేసుకుని ఉంటే ఏ నాయకుడైనా తెలుగు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పరు.

అడ్డుకట్టగా నిలుస్తారు. నిత్యం ‘మేడం’ని ప్రసన్నం చేసుకోవడంకన్నా మంచి పని మరొకటి లేదనుకునే ఇటువంటి వాళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు ఆశించడం వృథా! జనం గొడవ చేసిన తర్వాత గానీ ఓహో! ఇదొక సమస్యే సుమా! అని గుర్తించి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీ వెళ్లి పరువు నిలుపుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటికిది నయమే, కానీ దీర్ఘకాల ప్రయోజనాల మాటేమిటి?

రిలయన్స్ పెత్తనాన్ని ప్రశ్నించిన వైఎస్!
‘‘గ్యాస్ రాజ్యసంపద! మన రాష్ర్టం తీరం వెంబడి లభ్యమవుతున్నం దున రాష్ట్ర ప్రయోజనాలకు కొంత గ్యాస్‌ను విధిగా కేటాయించాల్సి ఉంది. తద్వారా చౌకగా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఎరువుల కర్మాగారాలను నడపవచ్చు. ఇంటింటికీ పైపు లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయవచ్చు. రియలన్స్ సంస్థ కేవలం గ్యాస్ వెలికి తీసే కాంట్రాక్టరు మాత్రమే, కాబట్టి గ్యాస్ ఉత్పత్తిపైన, కేటాయింపులు, అమ్మకం రేట్లపైన దానికి అధికారం ఉండకూడద’’ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పలు మార్లు పేర్కొన్నారు. కేంద్రానికి అనేక పర్యాయాలు లేఖలు రాశారు.

2009, జులై 7న రాజశేఖరరెడ్డి ప్రధానికి రాసిన లేఖలో కేజీ బేసిన్ డీ-6 బ్లాక్‌లో రియలన్స్ చేస్తున్న లూటీపై చాలా ఘాటుగా విరుచుకు పడ్డారు. లక్షల కోట్ల సంపద తరలిపోతోందంటూ కాగ్ ఇచ్చిన నివేది కను ఆయన ఉటంకించారు. రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపు, ధర నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని స్పష్టం చేశారు.

10 శాతం రాష్ట్రానికే కేటాయించాలి!
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌లో 10 శాతం తెలుగు ప్రాంతానికి దక్కాలని వైఎస్ ఆనాడే కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖ సాధికార మంత్రుల కమిటీ వద్ద పెండింగులో ఉంది. దీనికి విరుద్ధంగా కేటాయింపులు జరిగాయి. గ్యాస్‌ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం కారణంగా రాయల్టీ వసూలు చేస్తే కోట్లాది రూపాయలు రాష్ట్రానికి ఆదాయంగా వస్తాయి. కానీ, ఈ విషయాన్ని ఆ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకోలేదు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటింటికీ గ్యాస్ పైపులైను ఏర్పాటుపై సన్నాహాలు మొదలయ్యాయి. కానీ ఆయన అకాల మరణం తెలుగు జాతికి శాపంలా పరిణమించింది. ఆయన ప్రారంభించిన ఇతర పథకాల మాదిరే దీన్ని కూడా తుంగలోకి తొక్కారు నేటి పాలకులు.

ఇప్పుడేం చేయాలి!
* గ్యాస్ కేటాయింపుల విషయంలో పునఃసమీక్ష జరగాలి.
* రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌తో రాష్ట్రానికి మేలు కలగకపోతే ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తారు. కనుక కనీసం 10 శాతం గ్యాస్ రాష్ట్ర అవసరాలకు కేటాయించాలి.
* రిలయన్స్‌ను నమ్ముకొని అనేక విద్యుత్ ఎరువుల కర్మాగారాలను నెలకొ ల్పారు. వీరి అవసరాలకు, విస్తరణకు అవసరమైన గ్యాస్‌ను విధిగా అందించాల్సిన బాధ్యత రిలయన్స్‌దే!
* రానున్న కాలంలో ఎక్కువ ధరకు గ్యాస్ అమ్ముకునే ఉద్దేశంతో రియలన్స్ సంస్థ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తూ పోతోందన్న వాదన ఉంది. దీనిపై విచారణ జరపాలి.
* ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశిస్తూ, లక్ష్యాలకు తగ్గకుండా గ్యాస్ ఉత్పత్తి జరిగేలా రియలన్స్‌పై కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలి. ఇలా జరిగినప్పుడే జాతీయ సంపద ప్రజల సౌకర్యార్థం సవ్యంగా వినియోగించినట్లవు తుంది.

* రాజకీయ పక్షాలు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఈ విషయంలో ఒత్తిడి తేవాలి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే పాలకులను సహించేది లేదనే సంకేతం ప్రజల నుంచి సూటిగా వ్యక్తం కావాలి. అప్పుడు గానీ న్యాయం జరగదు.
Share this article :

0 comments: