ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకుడు... జగన్ కోసం - 14 (పాఠకుల స్పందన)sakshi - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకుడు... జగన్ కోసం - 14 (పాఠకుల స్పందన)sakshi

ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకుడు... జగన్ కోసం - 14 (పాఠకుల స్పందన)sakshi

Written By news on Monday, October 1, 2012 | 10/01/2012


నా వయస్సు 67 సంవత్సరాలు. నేను 1962 నుండి ఈ దేశ రాజకీయ వ్యవస్థను గమనిస్తున్నాను. దివంగత మన ప్రియతమ సిఎం వైయస్సార్‌గారు పేదలకోసం, రైతులకోసం ప్రవేశపెట్టి అమలుచేసిన సంక్షేమ పథకాలు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ చేసి ఉండరనుకుంటా! అందుకే ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. మనిషి ఎన్నాళ్లు బ్రతికిందన్నది కాదు, ఎలా బ్రతికింది ముఖ్యం. ఆయన మరణం తర్వాత కూడా సజీవంగా పేదప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు.

ఈ రాష్ట్ర ప్రజలకు అటువంటి నాయకుడు ఇక లేడు, రాడు అనుకున్న సమయంలో ఆయన తనయుడు జగన్ - ‘నేనున్నాను ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు అని ప్రజలలో ఒకడిగా తిరిగినప్పుడు అనిపించింది - తండ్రికంటే మించిన నాయకుడని. ఇవాళ 70 శాతం మంది ప్రజలు జగన్ నాయకత్వం కోరుకుంటున్నారు. ఎండనక వాననక, రాత్రనక పగలనక తన సుఖసంతోషాలకు దూరమై, ప్రజలలో ఒకడై, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ, పోరాటం చేసే ఒక మహానాయకుడిని ఈ నిరంకుశ ప్రభుత్వం బంధించి చెరసాలలో పెట్టినంతమాత్రాన అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఆయన ఒక మహా వెలుగై ఈ పేద ప్రజలకు వెలుగునిచ్చే రోజు త్వరలో వస్తుంది.

మన రాజ్యాంగంలో రాజకీయ వ్యవస్థ, న్యాయవ్యవస్థ రెండు మూలస్తంభాలు. కుళ్లు, కుతంత్రం, మోసాలతో భ్రష్టుపట్టి, ప్రజల సంక్షేమం మరచి, పదవులే ముఖ్యమని ప్రాకులాడుతున్న వ్యవస్థను మార్చడానికి వచ్చిన మన నాయకుడు జగన్. ఆయన వెంట ఉన్న ప్రజలను చూసి భయపడి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఈ దేశాన్ని పాలిస్తున్న సోనియాగాంధీ మహానాయకుడి మీద అక్రమ ఆస్తుల కేసు బనాయించి, సిబిఐని ఉసిగొల్పి, ఆ కుటుంబాన్ని అవమానపరచి, మానసిక క్షోభకు గురిచేసింది ఒక ఎత్తైతే, రెండవది ఇక్కడ అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ కలిసి కుట్రపూరితంగా సహకరించుకుని, వికటాట్టహాసం చేస్తున్నాయి. ఇది ఈరాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో తగిన బుద్ధిచెబుతారు. జాగ్రత్త!

హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనకు వచ్చినప్పుడు జడ్జి సముద్రాల గోవిందరాజులుగారు సిబిఐని - ‘జగన్ 5.50 లక్షల ఓట్లతో గెలిచిన ఎంపి, ఒక పార్టీకి ప్రెసిడెంట్. అదీగాక మొన్న జరిగిన ఉపఎన్నికల్లో 17 మందికిగాను 15 మంది శాసనసభ్యులు గెలిచారు. ఆయనకు జామీను ఎందుకు ఇవ్వకూడదు’ అని ప్రశ్నిస్తూనే, కొన్ని సామాజిక కారణాల వల్ల బెయిల్ ఇవ్వలేను అని చెప్పి ఆయన కూడా బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చేశారు. దీన్నిబట్టి మనకు అర్థమవుతోంది ఏదోఒక ఒత్తిడి ఉందని!

అక్టోబరు 5న సుప్రీంకోర్టులో బెయిల్ మీద వాదన రాబోతున్నది. నేను 70 శాతం ప్రజల తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీకు తెలుసు - జగన్‌గారు దేశద్రోహి కాదు, తీవ్రవాది కాదు. ఒక ప్రజా నాయకుడు, ప్రజలు మెచ్చిన, ప్రజలు కోరుకునే నాయకుడు. కనుక ఆయనకు జామీను ఇచ్చి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని చాటుతారని న్యాయమూర్తులకు విన్నవించుకుంటున్నాను.
- ఎం. శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా

ఆ పెద్దలకు నచ్చలేదు...

జగన్ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేయటం, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటం తద్వారా ప్రభుత్వంలో కదలిక, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం ప్రభుత్వంలో ఉండే పెద్దలకు నచ్చలేదు. జన హృదయాల్లో జగన్‌కు పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక జగన్‌ని ఎలాగైనా సరే ప్రజలకు దూరం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మ లాంటి సంస్థ సి.బి.ఐ.ని ఎన్నుకొని దాని ద్వారా వేధిస్తున్నారు. ఇదే సందర్భంలో మనం ప్రతిపక్షపార్టీ గురించి చెప్పుకోవాలి. వారి నాయకుడు ప్రజాసమస్యలపై ఎన్నడూ పోరాటం చేసింది లేదు. అధికారం కోల్పోయి దశాబ్దకాలం అవుతోంది. జగన్ రూపంలో ముచ్చటగా మూడవసారి కూడా అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎంతసేపు మీడియాను అడ్డం పెట్టుకొని అధికారం దక్కించుకోవాలనుకునే నాయకులకు, ప్రజల అండ ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలనుకునే నాయకులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇటువంటి చేతగాని వాళ్లే ఇంకొకరు వేసిన కేసులో భాగస్వామి కాగలరు. నీతీనిజాయితీ ఉన్న ఎవరైనా సరే ప్రత్యక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి దక్కించుకుంటారు గానీ ఇలా అడ్డదారిలో అధికారం కోసం గడ్డి తినరు.

పది నెలలు దర్యాప్తు చేస్తే ఒక్క చిన్న ఆధారం లభించని సి.బి.ఐ.కి ఇకముందు లభిస్తుంది అంటే అది హాస్యాస్పదమే. లక్ష కోట్ల అవినీతి అని పలికి ఇవాళ వేల నుండి వందల కోట్లకు ఆ లెక్క దిగజారిపోయినప్పుడే కాంగ్రెస్ పరువు, టి.డి.పి. పరువు అలాగే సి.బి.ఐ. పరువు దిగజారిపోయాయి. ప్రజాభిమానం ఉన్న నాయకుణ్ణి మీరు తాత్కాలికంగా నాలుగు గోడల మధ్య బంధించగలరేమో కాని జన హృదయాల్లో నాయకుడిగా నిర్ణయమై గుండెల్లో గుడికట్టుకున్న జగనన్నను ఏ కుట్రలు కుతంత్రాలు, ఏ అప్రజాస్వామ్యక శక్తులు ఏమీ చేయలేవు. రాబోయేది ‘రాజన్న రాజ్యం’. అది జగనన్నతో సాధ్యం. భారత రాజకీయాల్లో ‘కదలికను’ తీసుకుని వచ్చిన నాయకుడు జగన్. రాజకీయాలు అంటే ఇంట్లో కూర్చొని ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు ప్రజల దగ్గరకు వెళ్లే నాయకులకు కాలం చెల్లేలా చేసిన నాయకుడు జగన్.
- మధు, తిరుపతి

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: