జగన్ కోసం - 15 (పాఠకుల స్పందన)sakshi - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్ కోసం - 15 (పాఠకుల స్పందన)sakshi

జగన్ కోసం - 15 (పాఠకుల స్పందన)sakshi

Written By news on Tuesday, October 2, 2012 | 10/02/2012

జగన్ ఒక సంస్కారం గల వ్యక్తి. మాట తప్పని, మడిమ తిప్పని మనీషి. ఆయన సహనం, హుందాతనం, వ్యవహార శైలి, దక్షత ఈ దేశంలో ఏ పార్టీ నేతకూ లేవంటే అతిశయోక్తికాదు. అట్టి నాయకుణ్ణి చూసి ఓర్వలేక అణచి వేసే ప్రక్రియలో అన్యాయంగా, అక్రమంగా జైలు పాలు చేయడం అధికార పార్టీ నేతల సంకుచిత బుద్ధికి, వారి ఈర్ష్యకు నిదర్శనం.

అక్రమాస్తులు!...అక్రమాస్తులు...అని అదే పనిగా దండోరా వేస్తున్న బడా నాయకులకు ఈ ప్రజలను తప్పుదారి పట్టించడమే తెలిసిన విషయం. తన తండ్రి వై.యస్.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ కేవలం ఒక వ్యాపార వేత్త మాత్రమే కదా! కొన్ని ధనిక వర్గాలు ధనిక సంస్థలు, వ్యాపార వేత్తలు జగన్ వ్యాపార దక్షతను నైపుణ్యాన్ని గుర్తించి ఆయన వ్యాపారంలో పెట్టు బడులు పెడితే అక్రమమా? వ్యాపారం అభివృద్ధి చెందితే అక్రమాస్తులు ఎలా అవుతాయి? వ్యాపారి లక్ష్యం లాభమే కదా! ఆయన అందరి కంటే ముందే తన ఆదాయం పన్ను కట్టిన శ్రేష్టమైన భారత పౌరుడు.

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయాలను ప్రశించే అధికారం ఏ ప్రభుత్వ సంస్థలకైనా, న్యాయస్థానాలకైనా ఉంటుందా? ముఖ్యంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా, అభివృద్ధి దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను ఎవరు ప్రశ్నించగలరు? దీనికి రాజ్యాంగం ఏమి సమాధానమిస్తుందనేది పెద్ద ప్రశ్న. మంత్రివర్గ నిర్ణయాలను, ఫైళ్ల గమన విధానములను, మంత్రుల చొరవను అందులో తలెత్తిన తప్పొప్పులను ప్రశ్నించే అధికారం సి.బి.ఐ లాక్కుంటే ఇంకేముంది? ప్రభుత్వం, మంత్రివర్గం తమకున్న రాజ్యాంగాధికారాన్ని కోల్పోతాయి. ఇకపోతే సి.బి.ఐ. జేడీ దేవుడా? పాలకుడా? ఒక సామాన్య ప్రభుత్వాధికారి మాత్రమేకదా? ఆయన అక్రమంగా వ్యవహరిస్తే ప్రశ్నించే చట్టాలు రావాలి. 

ఆయన చట్టానికతీతుడా సి.బి.ఐ. జేడీ ‘‘కాల్ లిస్టు’’ ను ‘‘సాక్షి’’ బయట పెట్టిన తర్వాత ఆయన, ఆయన విచారణ తీరు మీడియా నుండి కనుమరుగై పోయింది. ఏమి? ఎందుకు?..ఎందుకు? అదంతా కుట్ర అని తెలిసి పోతుందనా? ఈ కోణంలో చూస్తే జగన్ నిర్దోషి. ఆయన ఈ రాష్ట్రానికి ఒక జ్యోతి. న్యాయమూర్తులు సత్వర న్యాయ విచారణ పూర్తి చేసి ఒక మంచి పౌరునికున్న పౌర హక్కులను కాపాడే విధంగా జగన్‌ను ఏరోజు జైలు నుండి బయటకు పంపుతారో ఆరోజే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మహా పర్వదినం.

- జె.యం.దినకర్, సరూర్‌నగర్, హైదరాబాదు.

దేవుడే నీ కుడిచెయ్యి వైపు!

హిందూమత ధర్మశాస్త్రాల ప్రకారం నాలుగు వేదాలు, రామాయణం, మహాభారతం (కావ్యాలు) ఉపనిషత్తులు పరిశీలిస్తే ప్రజారంజకుడైన వ్యక్తే రాజుగా పరిగణించబడతాడు. అందుకే ‘రాజును బట్టే ప్రజలు’ అనేవారు. ఏ రాజు పాలించినా మానవాభ్యున్నతికి పాటుపడితే ప్రజారాజ్యం సురక్షమై, దిక్కుమాలిన వారి బ్రతుకులు కూడా పచ్చతోరణాలు అవుతాయి. అందుకే రఘువంశానికి చెందిన శ్రీరాముడు, హరిశ్చంద్రులను ఈ రోజుకు కూడా ఎంతో గౌరవించి, పూజిస్తున్నాం. ‘అసతోమా సర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ’ అని వేదం చెబుతున్నది. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని తైతిరీయ ఉపనిషత్తు చెబుతున్నది. ఆ అన్నం పెట్టి దరిద్రంలో తాండవిస్తున్న మనుష్యులను శిఖరాగ్రాలకు తీర్చిదిద్దిన మనిషే రాజశేఖరరెడ్డిగారు.

చావుబ్రతుకులు ప్రతి జీవికి సహజం. కానీ, ప్రజోద్ధరణకు మనిషిగా ఏమి చేశాం? అని గుర్తుంచుకొని, బాధ్యతాయుతంగా నెరవేర్చిన మనిషే మహామనిషి. అందుకే అందరికీ దూరమైనా ఆ మహానుభావుణ్ణి స్మరించక తప్పదు. కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలు అందించినా, దానిని స్పష్టంగా అమలుపరిచే నాయకుడు ఉండాలి. ఆ నాయకుడే స్వర్గీయ డాక్టర్ రాజశేఖరరెడ్డిగారు. ఇది పొగడడం కాదు. పౌరునిగా మన స్పందన కావాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. 

రాజకీయ తాత్వికుడు ‘హెగెల్’ చెప్పినట్లు ప్రజావాక్యం దైవ వాక్యం. అది నిజంగా జగన్ జీవితంలో జరిగింది. అందుకు మొన్న జరిగిన ఎన్నికలే సాక్ష్యం. బైబిలు ప్రకారం పాత నిబంధనలో మోషే ‘నా తరువాత వచ్చేవాడి చెప్పులు మోయడానికి నా తరం కాదు’ అన్నాడు. ఆయన యేసు. యిది కొత్త నిబంధనకు 750 సంవత్సరాలకు ముందు వివరించిన సాక్ష్యం. అలాగే యేసు జన్మించడం, చివరకు లాటిన్‌భాషలో ‘లామా లామా సబక్తిజిన్’ అనడం... అంటే ‘దేవుడా! నన్ను చివరకు ఎందుకు జారవిడుచుచున్నావు?’ అని అనడం, చివరకు శిలువపై ప్రాణాలు పోవడం మరల కొద్ది దినాలకు సమాధి నుండి లేవడం జరిగిందని బైబిల్ చెబుతుంది. రాజశేఖరరెడ్డి గారు కూడా మరణ సమయంలో తన మనస్సులో ‘కాంగ్రెస్‌ను కాపాడి, రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నన్ను భద్రతాలోపాలతో పరలోకాలకు పంపుతున్నారే’ అనుకొని ఉండవచ్చు. 

ఏదేమైనా అటువంటి మహానుభావుని అంశలో పుట్టిన జగన్ ధర్మానికి కట్టుబడి, ఓర్పు నేర్పుతో విచారణకు సహకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ఉండి, తన భవిష్యత్తును ఆలోచించుకుంటూ, దేవునిపైనే భారం వేశాడు. ప్రజల అండదండలే ఆయనకు పూలదండలు. బైబిలులోని ప్రకటిత గ్రంథం పరిశీలిస్తే ‘నేను ఏదో సమయం దొంగవలె వస్తాను. అప్పుడు తప్పనిసరిగా పాపాలకు జవాబుదారి సమాధానం చెప్పాలి’ అంటాడు దేవునికి ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు. ఆయన కుడిహస్తం నీవైపు వుంది జగన్. నీవు దిగులుపడవద్దు. పుడమి తల్లికి పురిటి నొప్పులు తప్పవు. నీ ఓర్పు, నేర్పులే నీకు శ్రీరామరక్ష. కానున్నది కాకమానదు. రానున్నది రాకమానదు. అంత దేవేశ్చ.

- ఎం.వి.రామమోహనరావు, చందానగర్, రంగారెడ్డి జిల్లా


Share this article :

0 comments: