17,462 కిలోమీటర్లు.. 5,124 ఊళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 17,462 కిలోమీటర్లు.. 5,124 ఊళ్లు

17,462 కిలోమీటర్లు.. 5,124 ఊళ్లు

Written By news on Thursday, October 18, 2012 | 10/18/2012


హైద‌రాబాద్‌: వైఎస్ మరణంతో ఆత్మీయ ఆసరా కోల్పోయిన తెలుగు జాతి యావత్తు విలవిల్లాడింది. తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఓదార్చటం ఒక ధర్మంగా భావించిన తనయుడు జగన్ ఇచ్చిన మాట కోసం ఓదార్పుయాత్రను ప్రారంభించారు. వైఎస్ 2003లో ప్రజాప్రస్థానం ప్రారంభించిన రోజు గుర్తుగా 2010 ఏప్రిల్ 9న ఓదార్పుయాత్రప్రారంభించారు. గత మే నెల 27న విచారణ పేరుతో పిలిచి జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే నాటికి ఆయన గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తూ ప్రజల మధ్యనే ఉన్నారు.

ఇప్పటివరకు 13 జిల్లాల్లో ఓదార్పుయాత్ర పూర్తిచేశారు. ఉభయ గోదావరి, ఖమ్మం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 200 రోజులకు పైగా పర్యటించారు. 17,462 కి.మీ. మేర ప్రయాణించి 2,500 సభల్లో ప్రసంగించారు. ఈ జిల్లాల్లో 5,124 ఊళ్ల (120 వరకు పట్టణాలు కలిపి)లో ప్రజలను పలకరించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన 494 మంది కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చారు.
Share this article :

0 comments: