పార్టీఏదైనా ముఖేష్ మాటే చెల్లుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీఏదైనా ముఖేష్ మాటే చెల్లుతుంది

పార్టీఏదైనా ముఖేష్ మాటే చెల్లుతుంది

Written By news on Wednesday, October 31, 2012 | 10/31/2012

న్యూఢిల్లీ: కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖేష్ అంబానీ మాటే చెల్లుతుందని ఇటీవలే రాజకీయవేత్తగా మారిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో రిలయన్స్, ఎన్డీయే, కాంగ్రెస్ లపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఇండియా యాంటీ కరప్షన్' తరపున నీరారాడియా- రంజన్ భట్టాచార్య సంభాషణల టేపులు బయటపెట్టారు. దయానిధి మారన్ ను మంత్రిగా ఉంచవద్దని నిరారాడియా సూచన చేసినట్లు తెలిపారు. కేజీ బేసిన్ గ్యాస్ రిలయన్స్ కు దక్కడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని తెలిపారు. గ్యాస్ ధరలను పెంచాలని కేంద్రంపై రిలయన్స్ ఒత్తిడి తెచ్చిందన్నారు. రిలయన్స్ చెప్పినట్లే గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని చెప్పారు. కేజీ బేసిన్ గ్యాస్ తో 50 శాతం డిమాండ్ ను తట్టుకోవచ్చని కేజ్రీ వాల్ చెప్పారు. 

ఇంకా ఆయన అనేక విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లో ... వ్యాపార స్వార్థం కోసం గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ తగ్గించుకుంది. 8 ఎంసిఎండి సామర్ధ్యం ఉంటే రిలయన్స్ కేవలం 3 ఎంసిఎండి మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రిలయన్స్ కంటే తక్కువ ధరకు ఎన్ టిపిసి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం అంగీకరించడంలేదు. మురళీదేవరా పూర్తిగా రిలయన్స్ కు అనుకూలంగా వ్యవహరించారు. రిలయన్స్ గ్యాస్ ధరలను శాసిస్తే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రిలయన్స్ ను వ్యతిరేకించినందుకు జైపాల్ రెడ్డి పదవి పోయింది. ఇంధన శాఖ మంత్రులపై రిలయన్స్ పెత్తనం చెలాయిస్తోంది.

రిలయన్స్-కాంగ్రెస్-బిజెపి కుమ్మకయ్యాయి. రాజకీయం-వ్యాపారం మొత్తంగా కుమ్మక్కయ్యాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖేష్ అంబానీ మాటే చెల్లుతుంది. రిలయన్స్ చెప్పినవారినే పెట్రోలియం అధికారులుగా నియమిస్తున్నారు. కేబినెట్ లో మంత్రులను పారిశ్రామికవేత్తలే నిర్ణయిస్తున్నారు. దేశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ కాకుండా, ముఖేష్ అంబానీ పాలిస్తున్నారు.

source:sakshi
Share this article :

0 comments: