జగనే నాయకుడు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనే నాయకుడు...

జగనే నాయకుడు...

Written By news on Wednesday, October 31, 2012 | 10/31/2012

ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతపై ప్రజలకు నమ్మకం పోయింది
రెండు పార్టీలూ కుమ్మక్కై జగన్‌ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నాయి
ప్రజలు టీడీపీని సస్పెండ్ చేసేరోజు దగ్గర్లోనే ఉంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులపై నమ్మకం కోల్పోయిన ప్రజలు ఒక లీడర్ కోసం ఎదురుచూస్తున్నారని, ఆ లీడర్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని తంబళ్లపల్లి టీడీపీ ఎమ్మెల్యే ఎ.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అందుకే ఆయనకు తాను సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రం అనాథ అయిపోయిందని, ప్రజల అవసరాలు తీర్చి వారి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం అధికారపక్షంతో కుమ్మక్కయిందని విమర్శించారు. ప్రజలు టీడీపీని సస్పెండ్ చేసేరోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ప్రవీణ్ మంగళవారం చంచల్‌గూడ జైలులో ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. 

టీడీపీ ప్రధానంగా రెండు అంశాల ప్రాతిపదికగా ఏర్పాటైందని, ఒకటి తెలుగువారి సమైక్యాభివృద్ధి అయితే, రెండోది కాంగ్రెస్ వ్యతిరేకత అని ఆయన వివరించారు. అయితే ఈ రెండింటినీ టీడీపీ గాలికి వదలివేసిందని విమర్శించారు. ఒక విధాన ం అంటూ లేకుండా అస్తవ్యస్తంగా తయారైందన్నారు. 2004లో సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేసిన పార్టీ, 2008లో రాష్ట్రం విడగొట్టాలనే వైఖరిని తీసుకుందన్నారు. 2009 డిసెంబర్‌లో అసెంబ్లీలో చర్చలప్పుడు కూడా విడగొట్టమనే చెప్పిందన్నారు. తీరా డిసెంబర్ 9 ప్రకటన వెలువడ్డాక మాట మార్చిందన్నారు. తామందరికీ సమైక్యాంధ్ర ఉద్యమం చేయాల్సిందిగా సూచించారని తెలిపారు. మళ్లీ తాజాగా ఒక లేఖను ఇచ్చి ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 

స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలిసిపోయి జగన్‌ను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను జైల్లో పెట్టించడానికి టీడీపీ, కాంగ్రెస్‌లు శాయశక్తులా కృషి చే శాయని ధ్వజమెత్తారు. 2009 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 90 మంది టీడీపీ శాసనసభ్యులను గెలిపించి పంపినా.. ప్రతిపక్ష పాత్రను నిర్వహించడంలో ప్రస్తుత నాయకత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు. ఎప్పుడూ జగన్‌నూ, వైఎస్ కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడదామా.. అనే ఆలోచనల్లోనే మునిగితేలుతున్నారని తెలిపారు. ఒకప్పుడు 50 శాతం ఓట్ల మద్దతు కలిగిన టీడీపీ తన విధానాలతో దానిని 18 శాతానికి దిగజార్చుకుందన్నారు. 

అధికార, ప్రతిపక్షాలు తమ సమస్యలు పరిష్కరిస్తాయన్న నమ్మకం ప్రజలకు లేద న్నారు. అందుకే తానూ యువ శాసనసభ్యుడిగా జగన్ వెంట నడుస్తున్నానని చెప్పారు. జగన్ ఇబ్బందుల్లో ఉన్నా, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకపోయినా మంచి మనసుతో తామందరమూ ఆయనకు మద్దతునిస్తున్నామన్నారు. టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేసిన విషయం ప్రస్తావించగా.. ప్రజలు ఆ పార్టీనే సస్పెండ్ చేసే రోజు దగ్గరలోనే ఉందని జవాబిచ్చారు. భవిష్యత్తులో అది చరిత్రలో మిగిలి పోయిన పార్టీగానే ఉంటుందన్నారు. వారం రోజుల తరువాత మంచిరోజు చూసుకుని తాను వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతానని ప్రవీణ్ ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఏరకంగా అవసరం అనుకుంటే అలా ఉపయోగపడతానని చెప్పారు.
Share this article :

0 comments: