బాబూ..ఏ ముఖంతో మీ పాదయాత్ర? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » బాబూ..ఏ ముఖంతో మీ పాదయాత్ర?

బాబూ..ఏ ముఖంతో మీ పాదయాత్ర?

Written By news on Wednesday, October 31, 2012 | 10/31/2012

తొమ్మిదేళ్ల తన పాలనలో వ్యవసాయరంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నచూపు చూసిన టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఇపుడు ఏ ముఖం పెట్టుకుని గ్రామాలకు వెళుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రశ్నించారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నన్ను నేను శిక్షించుకుంటూ... వస్తున్నా... మీకోసం’ అని చంద్రబాబు పాదయాత్రలో చెబుతున్నారని, అయితే ఆయన ఏ పాపం చేస్తే ఇపుడు శిక్షించుకుంటున్నారో జవాబు చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. బాబు తన హయాంలో రైతులను పట్టించుకోకపోగా దొంగల్లాగా చూశారని విమర్శించారు. 

‘‘ రైతులపై విద్యుత్ చౌర్యం కేసులు పెట్టి శిక్షించడానికి 2000 సంవత్సరంలో 89వ నంబరు జీవోను జారీ చేసింది చంద్రబాబు. వారికి సత్వరం శిక్ష పడేలా చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందీ ఆయనే! విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆందోళన చేస్తే బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపింది కూడా ఆ మహానుభావుడే. కాల్దారిలో రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే వారిపై కాల్పులు జరిగింది ఆయన హయాంలోనే... మొత్తం రైతులను నిర్వీర్యం చేసి ఇపుడు వారికి తానేదో చేస్తానని వెళ్లడం హాస్యాస్పదంగా ఉంది’’ అని ఆయన దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళనగా మాట్లాడింది కాక ఒక హెచ్‌పీ విద్యుత్ మోటారుకు 50 రూపాయలుగా ఉన్న ఛార్జీని 450 నుంచి 650 రూపాయలకు పెంచి రైతుల ఉసురు పోసుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. రైతులను ఇంతగా బాధపెట్టిన వ్యక్తి అసలు వారి వద్దకు వెళ్లే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు.
Share this article :

0 comments: