అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం

అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం

Written By news on Saturday, October 20, 2012 | 10/20/2012


అదే జోరు..జనహోరు.. జనంతో మమేకం అవుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల శుక్రవారం రెండోరోజు ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రను ప్రారంభించారు. చిరునవ్వులతో చిన్నారులను పలకరించారు. విద్యార్థినులకు, వికలాంగులకు ధైర్యం చెప్పారు. మహిళలపై ఆప్యాయత చూపారు. వృద్ధులకు భరోసా కల్పించారు. 

అన్నదాతల అగచాట్లను కళ్లారా చూశారు. కాయలు లేని వేరుశనగ కట్టెను పరిశీలించారు. వారి కష్టాలను విని చలించిపోయారు. పాలకుల దమన నీతిని ఎండగట్టారు. పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని, కష్టాలన్నీ తీరుతాయని భుజం తట్టారు. 

కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు రెండో రోజు శుక్రవారం నాడు అపూర్వ ఆదరణ లభించింది. 15 కిలోమీటర్లు సాగినయాత్రలో సమస్యలను చెప్పుకునేందుకు పల్లెజనం పోటీపడ్డారు. 

వేంపల్లె సమీపం నుంచి మొదలైన పాదయాత్ర మండల కేంద్రమైన వేములకు చేరుకుని ముగిసింది. వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కేంద్రపాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్నకుమార్‌రెడ్డి, గొర్ల బాబూరావు, శోభా నాగిరెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే పిల్లిసుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ శేషుబాబు, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్, అంబటి రాంబాబు, ప్రసాదరాజు, రఘురామిరెడ్డి తదితరులు వెంటరాగా ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. 

15 నిమిషాల్లోపు రాజీవ్‌కాలనీకి చేరుకున్నారు. కాలనీవాసులంతా ఒక్కసారిగా వారి గోడును వెళ్లబోసుకున్నారు. రాజన్న లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. దీంతో షర్మిల వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఏపీ బాలికల గురుకుల పాఠశాలకు 10.45 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. స్పందించిన షర్మిల జగనన్న నాయకత్వంలో రాజన్నరాజ్యం వస్తుందని, అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని కోరారు. అక్కడి నుంచి కత్తులూరు క్రాస్‌కు చేరుకున్నారు. 

సమస్యలు వినలేని స్థితిలో ప్రభుత్వం.. గుర్తించలేని స్థితిలో ప్రతిపక్షం
కత్తులూరు క్రాస్‌కు చేరుకున్న షర్మిల మాట్లాడుతూ సమస్యలు వినలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, గుర్తించలేని స్థితిలో ప్రతిపక్షం ఉందని విమర్శించారు.

రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న త్వరలో మీ ముందుకు వస్తాడని వారిలో ధైర్యం నింపారు. అక్కడి నుంచి 12.50కు నందిపల్లెకు చేరుకుని వేరుశనగ పంటను పరిశీలించారు. ఆ గ్రామస్తులు షర్మిలకు చక్కభజనతో స్వాగతం పలికారు. వారితో చర్చించిన ఆమె 1.20 గంటలకు తాళ్లపల్లె గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామస్తులు చెండుమల్లె పూల బాట వేసి షర్మిలను నడిపించారు. అనంతరం ఆమె 1.40 గంటలకు ముసల్‌రెడ్డిపల్లెకు చేరుకున్నారు. 

అలాగే 1.45 గంటలకు సుద్దన్నగారిపల్లె క్రాస్, 2.00 గంటలకు అమ్మయ్యగారిపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన విడిదికి చేరుకున్నారు. అలాగే సాయంత్రం 4.45 గంటలకు తిరిగి ప్రారంభమైన పాదయాత్ర 5.00 గంటలకు అమ్మయ్యగారిపల్లె, 5.20 గంటలకు చాగలేరు క్రాస్, 5.30 గంటలకు వి.కొత్తపల్లెకుచేరుకుని 5.50 గంటలకు సమీపంలోని వేరుశనగ పంటను పరిశీలించారు. 6.30 గంటలకు గొందిపల్లె క్రాస్, 7.10 గంటలకు వేముల బహిరంగసభలో మాట్లాడి 7.45 గంటలకు వేముల సమీపంలో బస చేసే ప్రాంతానికి చేరుకున్నారు.

దుష్టశక్తులుండాయి జాగ్రత్త తల్లీ!
‘సువర్ణ పాలన అందించే మహానేత అర్ధంతరంగా చనిపోయారు.. జనంకోసం పరితపించే జగనన్న జైలుపాలయ్యారు... దుష్టశక్తులు తిరుగుతున్నాయి..జాగ్రత్త తల్లీ! ధైర్యంగా ఎదుర్కొలేరు, దొంగ దెబ్బ తీస్తారు.’ అంటూ పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు పల్లె ప్రజలు హెచ్చరించారు. ‘తండ్రిని ఎదుర్కోలేని దుష్టులు అర్ధంతర మృతికి కారకులయ్యారు.. జనం మెప్పు పొందిన జగన్‌మోహన్‌రెడ్డిని జైలుపాలు చేశారు..’ మిమ్మల్ని కూడా దెబ్బతీస్తారమ్మా.. జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సూచనలు చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ మీ అండ ఉన్నంతకాలం, రాజన్నను అభిమానించే హృదయం ఉన్నంతకాలం మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నారు. 

పూలబాటలతో స్వాగతం
రాజన్న బిడ్డ పల్లెల వెంబడి వస్తున్నట్లు తెలుసుకున్న జనం ఎర్రనీళ్ల దిష్టి తీస్తూ, హారతులిస్తూ ఆమె నడిచి వెళ్లే దారిలో పూలను పర్చి పూలబాట ఏర్పాటు చేశారు. ఆ బాటకు ఇరువైపులా గ్రామీణులు నిల్చున్నారు. వారి అభిమానానికి షర్మిల ముగ్దులై అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రెండోరోజు పాదయాత్రలో మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్స్ విభాగం అద్యక్షుడు శివభారత్‌రెడ్డి, కడప మాజీమేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, జమ్మలమడుగు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డితోపాటు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అన్ని పంటలు నాశనమయ్యాయి
పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. ఖరీఫ్‌లో అన్ని పంటలు నాశనమయ్యాయి. ఇన్స్యూరెన్స్ వస్తాదనుకుంటే వాతావరణ ఆధారిత బీమా పెట్టి మా కొంప ముంచారు. ఎకరాకు రూ.450 వస్తాంది. రాజశేఖరరెడ్డి హయాంలో మూడు సంవత్సరాలు వరుసగా 90 శాతానికి పైగా ఇన్స్యూరెన్స్ ఇచ్చారు. 
- రమణారెడ్డి, ఆదర్శరైతు

పనులు లేక అల్లాడుతున్నాం
అమ్మా! మాకు రాజశేఖరరెడ్డి ఇల్లు కట్టించారు.. ఆయన పుణ్యాన నీడపాటున నిద్రపోతున్నాం... మంచినీళ్లు లేవంటే జగనన్న రూ.15 లక్షలతో పైపులైను ఏర్పాటు చేయించారు. వ్యవసాయ కూలీలకు పోయేవాళ్లం. పనుల్లేక అల్లాడుతున్నాం.
- రేవతి రమాదేవి, పులివెందుల

మెస్ ఛార్జీలు చాలడం లేదు 
అక్కా! తాగేందుకు నీళ్లు లేవు. ఎటూ చాలకుండా మెస్ ఛార్జీలు ఇస్తాండారు. చదువుకునేందుకు పెద్దాయన మంచి భవనాలు కట్టించాడు. ఎం లాభం ఇప్పుడేమో కరెంటు ఉండడం లేదు.
- ఉర్దూ బాలికల పాఠశాల విద్యార్థినులు

తిండిగింజలు కూడా పండటం లేదు 
తల్లీ! పంటలు పోయినాయి. బోర్లలో నీళ్లు లేవు. అక్కడక్కడ నీళ్లొస్తాంటే తిండి గింజలకోసం సాగు చేసుకున్నాం. ఆ పంటలు కూడా అందే పరిస్థితి లేదు. ఇప్పుడేం చేయాల్నో దిక్కు తెల్లా! మీ నాయన కాలంలో అందరం బాగున్నాం. మూడేళ్లుగా నెత్తీనోరు కొట్టుకుంటున్నాం.
- లోడమ ఇందిరమ్మ, కొవ్వూరు 

ఓబులమ్మ, కత్తులూరు
ఆత్మహత్యలే శరణ్యం 
రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టాం తల్లీ! వేరుశనగ పంటంతా ఎండిపోయింది. పశువుల మేతకుగానీ పనికి రాదు. అప్పుడేమో రామరాజ్యం చూసినాం. ఇప్పుడు రావణరాజ్యం చూస్తున్నాం. పురుగుల మందు తాగి చచ్చిపోవాలని ఉంది.
- రామతులసి, కత్తులూరు
Share this article :

0 comments: