ఈడీ నోటీసుకు అర్థంలేదు: షర్మిళ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ఈడీ నోటీసుకు అర్థంలేదు: షర్మిళ

ఈడీ నోటీసుకు అర్థంలేదు: షర్మిళ

Written By news on Thursday, October 4, 2012 | 10/04/2012

క్విడ్‌ ప్రో కో కేసులో ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఇచ్చిన నోటీసు అర్థంలేనిదని వైఎస్ జగన్ సోదరి షర్మిళ కొట్టిపారేశారు. తల్లి విజయమ్మతో కలిసి గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... 'ఈడీనుంచి మేం ఇవాళ నోటీసు అందుకున్నాం. సాక్షి ఆస్తులను అటాచ్ చేస్తున్నామంటూ నోటీసు ఇచ్చింది. ఈడీ నోటీసులో హెటిరో, అరబిందో కంపెనీలు అక్రమంగా రూ.22 కోట్లు లబ్ధిపొందాయని పేర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగా వైఎస్ జగన్ కంపెనీల్లో రూ.29కోట్లు పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. రూ.22కోట్లు లబ్ది పొందితే... రూ.29కోట్లు పెట్టుబడి ఎలా పెడతారు? సాధారణ వ్యక్తికైనా ఇది అర్థమవుతుంది. ఆస్తుల అటాచ్ మెంట్ ఎంత అర్థలేనిదో దీనిబట్టి అర్థమవుతుంది. 

జగన్ ఆస్తులకేసును, ఈఎమ్మార్ కేసును సీబీఐ ఒకేసారి విచారిస్తోంది. కాని, చంద్రబాబుపై ఇప్పటివరకూ ఎలాంటి దర్యాప్తు చేయలేదు. చంద్రబాబు అక్రమాలపై ఇప్పటివరకూ సీబీఐ దృష్టే పెట్టలేదు. ఐఎంజీ కేసులోనూ ఇప్పటివరకూ చంద్రబాబును ప్రశ్నించలేదు. టీడీపీ ఎంపీలు ఈరోజు చిదంబరంని కలిశారు. ఈడీ వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టబట్టారు. అది జరిగిన రెండుగంటలకే ఈడీ నోటీసు ఇచ్చింది. జగన్ ను రాజకీయంగా అంతంచేయడానికే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందనుకున్న సమయంలో న్యాయవ్యవస్థను ప్రభావితంచేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

సీబీఐ తనకు తానుగా లాయర్లను మార్చుకుంటే... దానిపై రాద్ధాంతం చేశారు. గత విచారణ సమయంలో మా న్యాయవాదులు సన్నద్ధంగా లేరని సీబీఐ వాయిదా కోరింది. రేపు విచారణకు వస్తున్న సమయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు. జగన్ విడుదల కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. వారందరి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ కు న్యాయవ్యవస్థ లొంగదనే భావిస్తున్నాం. దేవుడిపై మాకు నమ్మకం ఉంది' అని షర్మిళ పేర్కొన్నారు.
Share this article :

0 comments: