ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు

ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు

Written By news on Saturday, October 27, 2012 | 10/27/2012


జనం.. జనం.. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా జనమే.. దిక్కులు పిక్కటిల్లేలా.. ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు.. అడుగులో అడుగేస్తూ కదంతొక్కిన జనసందోహం.. ఇదీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు జిల్లాలో నాలుగో రోజు వచ్చిన జనస్పందన. 

ఈనెల 18న ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. మన జిల్లాలో నాలుగో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి తుమ్మల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల్లో బస చేసిన షర్మిల శుక్రవారం ఉదయం 10.20 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. అక్కడి నుంచి నదిలా ప్రారంభమైన జనప్రవాహం ధర్మవరం చేరుకునే సరికి సముద్రాన్ని తలపించింది. 

తుమ్మల క్రాస్ నుంచి ధర్మవరం పట్టణానికి చేరుకునే మార్గమధ్యలో వేరుశనగ పొలంలో గుంటక పాస్తున్న మల్లేనిపల్లికి చెందిన రైతు కురుబ వెంకటేశును షర్మిల పలకరించారు. చేనులోకి ఎవరూ వెళ్లొద్దని సూచించిన షర్మిల.. పరిస్థితులపై రైతుతో ఆరా తీశారు. ‘అన్నా ఎన్ని ఎకరాల్లో వేరుశనగ వేశావు. ఎంత ఖర్చయింది.. ఎంత దిగుబడి వచ్చింది’ అంటూ ఆత్మీయంగా అడిగారు. ఇందుకు రైతు స్పందిస్తూ.. ‘అమ్మా మూడెకరాల్లో వేరుశనగ వేశా. రూ.30 వేల పెట్టుబడి వచ్చింది.. ఐదు బస్తాల దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.పది వేలు కూడా రావు.. మొత్తమ్మీద రూ.20 వేల నష్టం వచ్చింది’ అంటూ వివరించారు.

‘అన్నా.. ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇచ్చిందా? ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిందా?’ అంటూ ఆరా తీశారు. ‘అమ్మా.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ కచ్చితంగా వచ్చేది. ఇప్పుడు ఆ ధైర్యం మాకు లేదు. ఏటా అప్పులు చేసి పంట సాగు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెంచేసి.. వ్యాపారులకు, దళారులకు లాభం చేకూర్చుతోంది. రైతులను నాశనం చేస్తోంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. అధైర్యపడొద్దు.. ఈ కష్టాలు కొన్ని రోజులే. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అవుతారు. మహానేత రాజన్నలానే రైతుల పక్షాన పనిచేస్తారు. అందరికీ మేలు చేస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు.





Share this article :

0 comments: