వర్షించే మేఘన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వర్షించే మేఘన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు...

వర్షించే మేఘన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు...

Written By news on Wednesday, October 10, 2012 | 10/10/2012

ప్రతి రైతు సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేసిన ఘనత రాజశేఖరరెడ్డిది. ఆయన మరణం తర్వాత పంటను కాపాడుకోవడానికి రైతు... పొలాలు వదిలి వీధుల్లో పోరాటం చేయాల్సిన దుస్థితికి కారణం ఎవరు? అప్పుడు సాధ్యమైన 7 గంటల ఉచిత కరెంటు ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదు. అదే గవర్నమెంట్, అదే మంత్రులు, అదే హైకమాండ్ కదా! జగన్ రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించేలా చేశాడు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. బహుశా అందుకేనేమో జగన్‌ను జైలులో నిర్బంధించారు. పేదవాడు గుప్పెడు మెతుకులు తినడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదేమో. అందుకే జగన్‌ను ఇలా వేధిస్తోందా? అనే ప్రశ్న ప్రతి రైతును తొలచివేస్తోంది.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జలయజ్ఞం ఏమైనట్లు..? ఇప్పటివరకు అదనంగా ఎన్ని ఎకరాలకు నీరు అందించారు. ఎందుకిలా జరుగుతోంది. అదే జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావా? రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది కాదా? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం పచ్చగా ఉండడం ఇష్టంలేకనే జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించారా? వర్షించే మేఘాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. జగన్ కూడా అంతే. 

అధికారం ఈరోజు ఉంటుంది. రేపు ఉండకపోవచ్చు. కాని, కీర్తిప్రతిష్టలు శాశ్వతంగా నిలిచిపోతాయనే సత్యాన్ని పాలకులు గ్రహించడం మంచిది. ప్రజాశ్రేయస్సు కోరే నాయకుణ్ణి ప్రజల నుంచి దూరం చేయకండి. పేదవారిని భిక్షగాళ్లుగా దిగజార్చకండి. కక్షలకు ఇది వేదిక కాదు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. తెలుగు తల్లిని ఢిల్లీ వీధుల్లో అనాథగా నిలబెట్టే ప్రయత్నాలు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. జగనన్నని చూడాలని పరితపించే కోట్లాది గుండెలలో నేనూ ఒకడిని. జగనన్న త్వరలోనే మా ముందుకు వచ్చి, మా అందరి ఆశలు నెరవేరుస్తాడని ఆశతో ఎదురుచూస్తున్నాం.

- రామచంద్ర యెంబేటి, కోట, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
Share this article :

0 comments: