వైఎస్ జగన్ కు బెయిల్ నిరాకరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ కు బెయిల్ నిరాకరణ

వైఎస్ జగన్ కు బెయిల్ నిరాకరణ

Written By news on Friday, October 5, 2012 | 10/05/2012

న్యూఢిల్లీ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. క్విడ్‌ప్రో కో కేసులో బెయిల్‌ కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్‌ తోసిపుచ్చుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ పిటిషన్‌ సెప్టెంబర్‌ 14న ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. 

అయితే సీబీఐ కౌంటర్‌ పరిశీలించాల్సి ఉందంటూ జడ్జిలు విచారణను సెప్టెంబర్‌ 28కు వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ రెండోసారి తన న్యాయవాదులను మార్చడంతో సీబీఐ విజ్ఞప్తి దృష్ట్యా కేసును అక్టోబర్‌ 5కు ధర్మాసనం వాయిదా వేసింది. సీబీఐ తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ పరాశరన్‌, సీనియర్‌ న్యాయవాది అశోక్‌ బాన్‌ వాదించగా... జగన్‌ తరపున గోపాల్‌ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జగన్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇప్పటివరకూ సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేదని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం వాదించారు.

source:sakshi
Share this article :

0 comments: