వైఎస్సార్ సీపీలో రామకృష్టంరాజు చేరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్ సీపీలో రామకృష్టంరాజు చేరిక

వైఎస్సార్ సీపీలో రామకృష్టంరాజు చేరిక

Written By news on Friday, October 5, 2012 | 10/05/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: విశాఖపట్నానికి చెందిన శ్రీదేవి మాస్టర్ మీడియా అధినేత ఐ.రామకృష్ణంరాజు గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గనేత వాడుక రాజగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన బాటలోనే వైఎస్ జగన్ నడుస్తున్నారని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తిరిగి వైఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చగలిగే ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని అందరూ విశ్వసిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖులందరూ తమ పార్టీలో చేరడం శుభపరిణామమని అన్నారు.
Share this article :

0 comments: