‘అనంత’ను సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్‌దే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘అనంత’ను సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్‌దే

‘అనంత’ను సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్‌దే

Written By news on Wednesday, October 31, 2012 | 10/31/2012

 తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అలుపెరగని పోరాటం చేశారని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి గుర్తు చేశారు. 

మంగళవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా అనంతపురం రూరల్ పరిధిలోని పిల్లిగుండ్ల కాలనీలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. టీడీపీ పాలనలో చంద్రబాబు సేద్యాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అప్పుడు రైతు కుటుంబాలు చిన్నాభిన్నమై పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లాయన్నారు. వైఎస్ సీఎం అయ్యాక రైతులను అన్నివిధాలా ఆదుకున్నారన్నారు. సేద్యానికి పెద్దపీట వేసి రైతు కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నింపారని కొనియాడారు. పీఏబీఆర్‌కు పది టీఎంసీల నీటిని కేటాయించి తాగు, సాగునీటి కష్టాలను తీర్చారన్నారు. 

అయితే ఈ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసిందని విమర్శించారు. ‘మహానేత ఉండి ఉంటే ఈ పాటికి హంద్రీ-నీవా పూర్తయ్యేది. పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చేవి. పది వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేవ’ని స్పష్టం చేశారు.

చంద్రబాబు అండతో పరిటాల రవీంద్ర గూండాలు, రౌడీలు, సూడో నక్సల్స్‌తో కలిసి ప్రజలను భయోత్పాతానికి గురి చేశారని విమర్శించారు. హత్యా రాజకీయాలు నడిపి జిల్లాను రావణకాష్టం చేశారన్నారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించే పరిటాల కుటుంబం ఇన్నాళ్లూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని, ప్రజాభిమానంతో కానే కాదని స్పష్టీకరించారు. ‘వైఎస్ ఫ్యాక్షన్‌ను ఉక్కుపాదంతో అణచివేసి జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చేశారు. ఆయన రెక్కలకష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం... చంద్రబాబు పాలనను తలపిస్తోంది. అన్ని వర్గాల ప్రజలనూ ఇబ్బందులకు గురిచేస్తోంద’ని దుయ్యబట్టారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేదన్నారు. నసనకోట ముత్యాలమ్మ ఆలయ ఆదాయాన్ని దోచుకోవడంలోనూ, సివిల్ సప్లయీస్ టెండర్లలో మైనార్టీలను బెదిరించి సొమ్ము చేసుకోవడంలోనూ పరిటాల కుటుంబం ముందుంటోందని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేస్తుందన్నారు. రాజన్న రాజ్యంలో రాప్తాడు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 
Share this article :

0 comments: