జగన్‌ను ఎదుర్కొనేందుకే ఏపీకి పెద్దపీట: బాల్‌ఠాక్రే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను ఎదుర్కొనేందుకే ఏపీకి పెద్దపీట: బాల్‌ఠాక్రే

జగన్‌ను ఎదుర్కొనేందుకే ఏపీకి పెద్దపీట: బాల్‌ఠాక్రే

Written By news on Tuesday, October 30, 2012 | 10/30/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకే కేంద్ర మంత్రిమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద పీట వేశారని శివసేన అధినేత బాల్ ఠాక్రే తెలిపారు. సోమవారం సామ్నా దినపత్రిక సంపాదకీయంలో కేబినెట్ విస్తరణపై ఠాక్రే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సామ్నాతోపాటు మహారాష్ట్రలోని దాదాపు అన్ని ప్రముఖ మరాఠీ దినపత్రిక ల సంపాదకీయాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. జగన్, తెలంగాణ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి మండలిలో ఏపీకి ప్రాధాన్యతనిచ్చారని ఆ పత్రికలు పేర్కొన్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకే చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని ఠాక్రే చెప్పారు. అయితే ఈ అంశాలు జగన్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌నకు చెందిన ‘లోక్‌సత్తా’ దినపత్రిక కూడా ఇదే విధంగా అభిప్రాయపడింది. ‘‘వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడైన జగన్‌కి కాంగ్రెస్ సరైన ఆదరణ ఇవ్వలేదు. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆయన్ని ఎదుర్కొనేందుకు దర్యాప్తుల పేరుతో జైలులో కూడా పెట్టించారు. మరోవైపు తెలంగాణ అంశంపై కూడా కాంగ్రెస్ ఎటూ తేల్చలేకపోయింది. జగన్, తెలంగాణ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పెద్ద పీట వేసింది’’ అని లోక్‌సత్తా పత్రిక పేర్కొంది. 
Share this article :

0 comments: