బినామీని ముందుకు తెచ్చి ఆదేశాలు రాకుండా అడ్డుకున్న బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బినామీని ముందుకు తెచ్చి ఆదేశాలు రాకుండా అడ్డుకున్న బాబు

బినామీని ముందుకు తెచ్చి ఆదేశాలు రాకుండా అడ్డుకున్న బాబు

Written By news on Tuesday, October 2, 2012 | 10/02/2012

ఆశ్చర్యపోయిన ధర్మాసనం.. నోటీసులు ఇచ్చామని స్పష్టీకరణ 

తనకు అందలేదన్న బిల్లీరావు... కోరిన గడువునిచ్చిన ధర్మాసనం

కేసు విచారణ జరుగుతుండగా ఆరు నెలలుగా బిల్లీరావు మౌనం 

సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలిచ్చే కీలక సమయంలో ప్రత్యక్షం 

బినామీని ముందుకు తెచ్చి ఆదేశాలు రాకుండా అడ్డుకున్న బాబు 

జీవో 310పై పిటిషన్‌ను సింగిల్ జడ్జి వద్దకు తెప్పించే యత్నాలు

అవసరమైతే మరోసారి ‘నాట్ బిఫోర్’ నాటకాలకూ బాబు సిద్ధం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వేల కోట్ల రూపాయల విలువ చేసే ఐఎంజీ భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుటిల యత్నాలు మొదలుపెట్టారు. అంతర్జాతీయంగా క్రీడలతో ఏ మాత్రం సంబంధం లేని ఐఎంజీ అకాడమీకి వేల కోట్ల రూపాయల విలువైన 850 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు కట్టబెట్టటంతో పాటు, ఇందుకు సంబంధించి జరిగిన చీకటి ఒప్పందాలపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించనున్న నేపథ్యంలో చంద్రబాబు తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబలరావు ద్వారా పావులు కదిపారు. అందులో భాగంగా సోమవారం తొలి అంకం మొదలైంది. 

ఐఎంజీ కేసు విచారణకు వచ్చి ఆరు మాసాలు దాటినా ఇప్పటివరకూ మౌనంగా ఉన్న బిల్లీరావు.. తీరా ఇప్పుడు తనకు కోర్టు నుంచి ఎటువంటి నోటీసు అందలేదంటూ హైకోర్టుకు చెప్పటం గమనార్హం. రెండు వారాల గడువు ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తానని కూడా ఆయన చెప్పారు. దీనికి న్యాయస్థానమూ అంగీకరించింది. తద్వారా చంద్రబాబు విజయవంతంగా తన బినామీ ద్వారా సోమవారం సీబీఐ దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా అడ్డుకోగలిగారని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు ఈ కేసును సాగతీసేందుకు, దర్యాప్తుకు ఆదేశాలు రాకుండా ఉండేందుకు అవసరమైన మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారని ఈ కేసును దగ్గరగా గమనిస్తున్న న్యాయనిపుణులు చెప్తున్నారు. 

ఐఎంజీ భూముల కేటాయింపు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం 2006లో సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ జీవో 310 జారీ చేసినా, సీబీఐ ఇప్పటి వరకు దర్యాప్తు ప్రారంభించలేదని, ఈ వ్యవహారంలో వెంటనే దర్యాప్తు ప్రారంభించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, ఆడిటర్ వి.విజయసాయిరెడ్డిలు ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో న్యాయవాది టి.శ్రీరంగాారావు కూడా మరో పిల్ దాఖలు చేశారు. ఐఎంజీబీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాలు, కల్పించిన రాయితీలు తదితర అంశాలపై సీబీఐ జరిపే దర్యాప్తును పర్యవేక్షించేలా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ను ఆదేశించాలని ఎ.బి.కె ప్రసాద్, విజయసాయిరెడ్డిలు తమ వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. 

ఈ మొత్తం వ్యవహారంలో వెంటనే ప్రాథమిక విచారణ చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని శ్రీరంగారావు తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ రెండు వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్, న్యాయమూర్తి జస్టిస్ విలాస్‌అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర హోంశాఖ, సీబీఐ తమ తమ కౌంటర్లు దాఖలు చేశాయి. కోర్టు ఆదేశిస్తే ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. అయితే దర్యాప్తుకు సంబంధించి సోమవారం (అక్టోబర్ 1న) తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం గత విచారణ సమయంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని ఎదురుచూశారు. 

నోటీసులిచ్చాం కదా...
సోమవారం కేసు విచారణకు రాగానే అందరికన్నా ముందు బిల్లీరావు తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ లేచి నిల్చున్నారు. తమకు ఇంత వరకు హైకోర్టు జారీ చేసిన నోటీసు అందలేదని చెప్పారు. అందువల్ల తమకు రెండు వారాల సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులతో పాటు ధర్మాసనం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ‘నోటీసులు అందకపోవటం ఏమిటి..? ఈ కేసులో మీతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశాం. వారు తమ తమ కౌంటర్లు కూడా దాఖలు చేశారు. ఈ రోజు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా చెప్పాం’ అని ధర్మాసనం పేర్కొంది. నోటీసులు అయితే తమకు అందలేదని, అందుకే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరుతున్నామని వెంకటరమణ చెప్పారు.

దీంతో ఇరువురు న్యాయమూర్తులు కూడా కొద్దిసేపు తమలో తాము చర్చించుకున్నారు. తరువాత పిటిషనర్ల స్పందన కోరారు. శ్రీరంగారావు తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు స్పందిస్తూ.. ఇప్పటికే సీబీఐ కౌంటర్ దాఖలు చేసి, దర్యాప్తు చేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసిం దని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో కూడా ఇరువురు న్యాయమూర్తులు చర్చించుకుని, కౌంటర్ దాఖలు చేసేందుకు బిల్లీరావుకు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. కౌంటర్ దాఖలు చేయగానే, దాని కాపీని పిటిషనర్లకు అందచేయాలని వెంకటరమణను ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ అందుకోగానే, దానికి తిరుగు సమాధానం (రిప్లై) కూడా ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తం రెండు వార్లాలో పూర్తి కావాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఇరుపక్షాలకు స్పష్టం చేసింది.

‘బిల్లీ’కి ఇప్పుడే గుర్తొచ్చిందా..?
ఈ కేసులో బిల్లీరావు ఆకస్మికంగా తెరపైకి వచ్చి.. కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం కోరడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయకుండా అడ్డుకునేందుకేనని వారు చెప్తున్నారు. వాస్తవానికి ఎ.బి.కె.ప్రసాద్, విజయసాయిరెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని ఈ ఏడాది మార్చి 1న హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం తరచుగా విచారణకు వస్తూనే ఉంది. 

హైకోర్టు కొత్త తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బాధ్యతలు చేపట్టిన తరువాత అన్ని ప్రయోజనాల వ్యాజ్యాల్లో లానే ఈ కేసులో కూడా విచారణ వేగవంతమైంది. కేసును లోతుగా విచారించిన ధర్మాసనం, జూలై 27న ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ డెరైక్టర్, ఐఎంజీ అకాడమీస్ డెరైక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ‘మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ కేసులో బిల్లీరావు తరఫు న్యాయవాది కోర్టు ముందు హాజరు కాలేదు. కనీసం విచారణనూ పరిశీలించలేదు. అంటే ఆరునెలల కాలంగా బిల్లీరావు మౌనంగా ఉన్నారన్న మాట. అంటే ఓ వ్యూహం ప్రకారమే బిల్లీరావు మౌనంగా ఉన్నారు. 

ఈ కేసులో తన వాదనలు వినిపించాలని బిల్లీరావుకు ఉండి ఉంటే.. నోటీసులు జారీ చేసే రోజునో, లేకపోతే తదుపరి విచారణ సమయంలోనో తనకు నోటీసులు అందలేదన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చి, కౌంటర్ దాఖలుకు సమయం కోరేవారు. ఎప్పుడైతే ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధమని సీబీఐ చెప్పిందో, తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసిందో, అప్పుడే చంద్రబాబు తన బినామీ బిల్లీరావును రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఈ కేసులో జరగబోయే పరిణామాలన్నింటినీ బాబు అండ్ కో వివరించటంతో బిల్లీరావు మేల్కొన్నారు. అందులో భాగంగానే జీవో 310ని కొట్టివేయాలంటూ గత వారం హైకోర్టులో ప్రత్యేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేయిం చారు’ అని ఓ సీనియర్ న్యాయవాది వ్యాఖ్యానించారు. 

source:Sakshi
Share this article :

0 comments: