సోదాల్లో ఏం దొరకలేదు: సిబిఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోదాల్లో ఏం దొరకలేదు: సిబిఐ

సోదాల్లో ఏం దొరకలేదు: సిబిఐ

Written By news on Tuesday, October 9, 2012 | 10/09/2012


వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతిలోకి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం ఆ సంస్థకు చెందిన మీడియాలోకి వస్తున్న డబ్బు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కొన్ని సంస్థల్లో తనిఖీలు చేసేందుకు అనుమతి కోరిన సిబిఐ, పని పూర్తయినట్లు సిబిఐ కోర్టుకు నివేదిక ఇచ్చింది. సోదాల్లో తమకు బలమైన ఆధారాలు ఏమీ దొరకలేదని తెలిపింది.
ఈ మేరకు నాంపల్లి సిబిఐ కోర్టుకు సోమవారం సెర్చ్ రిపోర్టును సిబిఐ ఉన్నతాధికారులు రహస్యంగా అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కోర్టు అనుమతితో తాము జీడిమెట్లలోని కెఐజె ప్లాస్టిక్స్, గ్రీన్ ట్రేడ్ కంపెనీల్లో ఈ నెల 5న సోదాలు చేశామని, కానీ, అక్కడ తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. ఈ మేరకు కోర్టుకు నివేదిక అందిస్తున్నామని సిబిఐ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొంది.
వాస్తవానికి జగతిలోకి పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఆయా కంపెనీల్లో తనిఖీలు చేసేందుకు పెద్ద కసరత్తే చేసింది. 4న ఈడి జగతి, మరికొన్ని సంస్థల ఆస్తులను జప్తు చేసినప్పుడే, నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చిన ఉన్నతాధికారి ఒకరు నేరుగా అనుమతి పత్రాలను కోర్టుకు అందజేసి, ఆమోదింపజేసుకున్నారు.

source: andhrajyothy
Share this article :

0 comments: