షర్మిల తొలిరోజుయాత్ర సాగేదిలా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల తొలిరోజుయాత్ర సాగేదిలా..

షర్మిల తొలిరోజుయాత్ర సాగేదిలా..

Written By news on Thursday, October 18, 2012 | 10/18/2012

షర్మిల గురువారం ఉదయం పది గంటలకు తన మాతృమూర్తి వై.ఎస్.విజయమ్మ, వదిన వైఎస్ భారతి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్(సమాధి) వద్ద నివాళులర్పిస్తారు. ఇదే సందర్భంగా జరిగే సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. సరిగ్గా 11 గంటలకు షర్మిల తన పాదయాత్రను ప్రారంభిస్తారు. నడకను ప్రారంభించిన కొద్ది సేపటి కి.. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. విజయమ్మ కూడా తన కుమార్తె పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో తన ప్రసంగంలో తెలియజేస్తారు. 

ప్రసంగాలు ముగిసిన తరువాత షర్మిల అక్కడికి సమీపంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత తన పాదయాత్రను కొనసాగిస్తారు. వైఎస్సార్ ఘాట్ నుంచి వీరన్నగట్టు పల్లెకు(5.5 కి.మీ.), అక్కడి నుంచి కుమ్మరాంపల్లెకు(1.5 కి.మీ.) ఆ తరువాత సాయంత్రం వేంపల్లి నాలుగు రోడ్ల కూడలికి (5 కి.మీ.) షర్మిల చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీకి వెళ్లి సమీపంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక బసకు చేరుకోవడంతో తొలి రోజు 15 కిలోమీటర్ల యాత్ర పూర్తవుతుందని పాదయాత్ర సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యుడు తలశిల రఘురామ్ తెలిపారు. షర్మిల బస కోసం రోడ్డు పక్కనే గుడారాలు వేస్తున్నట్లు చెప్పారు.
Share this article :

0 comments: