'ఆరోపణలపై వాద్రా సమాధానం చెప్పాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'ఆరోపణలపై వాద్రా సమాధానం చెప్పాలి'

'ఆరోపణలపై వాద్రా సమాధానం చెప్పాలి'

Written By news on Saturday, October 6, 2012 | 10/06/2012

న్యూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకైనా సిద్ధమేనని సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ సవాలు విసిరారు. ఆయనపై తన ఆరోపణలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ సమస్యలపై శనివారం ‘బిజిలీ-పానీ’ సత్యాగ్రహం ప్రారంభించిన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. పైసా పెట్టుబడి లేకుండా వాద్రా రూ.300 కోట్ల మేరకు ఆస్తులు కూడగట్టుకున్న వైనంపై కేజ్రీవాల్, ప్రముఖ న్యాయవాదులు శాంతిభూషణ్, ప్రశాంత్‌భూషణ్‌లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాము చేసిన ఆరోపణలపై వాద్రా సమాధానం చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=463967&Categoryid=14&subcatid=0
Share this article :

0 comments: