చంద్రబాబుకు మతి భ్రమించింది: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు మతి భ్రమించింది: అంబటి

చంద్రబాబుకు మతి భ్రమించింది: అంబటి

Written By news on Monday, October 22, 2012 | 10/22/2012

చంద్రబాబు స్థాయిదిగజారి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు కాళ్లకు కాదు బుర్రకు వైద్యం చేయాలని అంబటి వ్యాఖ్యలు చేశారు. చౌకబారు మాటలతో చంద్రబాబు ఆయన స్థాయి దిగజారుతున్నారన్నారు. అంతేకాక చంద్రబాబుకు మతిభ్రమించినట్లుందని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. పాదయాత్రపై కొన్ని పత్రికలు, ఛానల్స్‌లో పెయిడ్‌ న్యూస్‌ వేసుకునే స్థాయికి దిగజారాడని అయన విమర్శించారు. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని అంబటి అన్నారు. సీఎం కావాలన్న తపన తప్పా ప్రజాసమస్యలు పట్టడం లేదని అన్నారు. అధికారం కోసం పాదయాత్ర చేయాల్సిన అవసరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదని అంబటి తెలిపారు.
Share this article :

0 comments: