‘మంత్రులకు న్యాయసాయం’ పిటిషన్‌పై సుప్రీం ఆదేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మంత్రులకు న్యాయసాయం’ పిటిషన్‌పై సుప్రీం ఆదేశం

‘మంత్రులకు న్యాయసాయం’ పిటిషన్‌పై సుప్రీం ఆదేశం

Written By news on Tuesday, October 16, 2012 | 10/16/2012


న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: వివాదాస్పద 26 జీవోల అంశంలో మంత్రులకు ప్రభుత్వం న్యాయసా యం అందించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీన్ని తాము ప్రత్యేకంగా విచారించలేమని, ఇదే అంశంలో గతంలో దాఖలైన ప్రధాన పిటిషన్‌తో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆరోపణలను ఎదుర్కొంటున్న వారికి న్యాయ సాయమందివ్వడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఓఎం దేబరా ఇంతకుముందు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు దీన్ని కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఖలీఫుల్లాల బెంచ్ విచారించింది. మంత్రులు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకుర్చేలా ప్రయత్నించడంతో పాటు ప్రజాధనం పెద్ద మొత్తంలో దుర్వినియోగం చేసేం దుకు కారకులయ్యారని, ఇలాంటి వారికి న్యాయసాయం అందించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.

‘26 జీవోలకు సంబంధించి సంబంధిత శాఖల మంత్రులు ఆరుగురిని బాధ్యులను చేయాలంటూ గతంలో సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, గత మార్చి 12న సుప్రీం కోర్టు రాష్ట్ర మంత్రులు ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం మంత్రులకు న్యాయ సాయం అందించేందుకు వీలుగా జీవోలు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసాయం పేరుతో ప్రజాధనాన్ని వెచ్చించడం న్యాయసమ్మతం కాదు’ అని పిటిషనర్ విన్నవించారు. దీనిపై జస్టిస్ ఠాకూర్ కల్పించుకొని ‘ప్రజాధనాన్ని ఎవరికోసం వృథా చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ‘గతంలో ఇదే కోర్టు ఆరుగురు మంత్రులుకు నోటీసులు ఇచ్చింది. ఆ మంత్రులకే ప్రజాధనాన్ని వెచ్చిం చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది’ అని నివేదించారు. జస్టిస్ ఠాకూర్ కల్పించుకొని, ఈ పిటిషన్‌ను ప్రస్తుతం విచారించలేమన్నారు. దీన్ని ఇప్పటికే తమ ముందున్న ప్రధాన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=469739&Categoryid=1&subCatId=32
Share this article :

0 comments: